MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత.. ప్రచార వాహనం పైనే పడిపోయిన కవిత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల లో రోడ్ షో లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోసం ఎమ్మెల్సీ కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె బాగా నీరసించిపోయి, కళ్ళు తిరిగి పడిపోయాడు.

MLC Kavita is seriously ill.. Kavita fell on the campaign vehicle
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవితకు (Kavitha) తీవ్ర అస్వస్థత చోటు చేసుకుంది. జగిత్యాల (Jagityala) జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కవితి సృహతప్పి పడిపోయింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల లో రోడ్ షో లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోసం ఎమ్మెల్సీ కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె బాగా నీరసించిపోయి, కళ్ళు తిరిగి పడిపోయాడు. తోటి కార్యకర్తలు సపర్యలు చేసిన తర్వాత.. కాసేపటికే ఆమె కోలుకొని.. తిరిగి ప్రచారం ప్రారంభించారు.
గత మూడు రోజులుగా కవిత ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తున్నందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని తోటి నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఎండ బాగా ఉన్నాయి. ఎండలో ఆమె ప్రచారం చేస్తూ.. నీరసించిపోయి.. ప్రచార వాహనంలోనే సొమ్మసిల్లి పడిపోయారు. ఇక ఎమ్మెల్యే సంజయ్.. స్వతహాగా డాక్టర్ కావడంతో.. ఆమెను పరిశీలించి తగిన చర్యలు తీసుకోని తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.