మాకో తులం బంగారం, రేవంత్ పై కవిత కామెంట్స్

మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేసిన ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 06:24 PMLast Updated on: Dec 25, 2024 | 7:01 PM

Mlc Kavitha Fire On Revanth Reddy

మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేసిన ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అన్నారు. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు మెదక్ కి వచ్చాయని అమ్మగారి ఊరు కాబట్టి మెదక్ కి రావాలని ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గోదావరి జలాలతో సింగూరు నింపి మెదక్ జిల్లాకి నీళ్లు తెచ్చారని కాళేశ్వరం పనులు మెదక్ జిల్లాలో సగంలోనే నిలిచిపోయాయన్నారు.

ప్యాకేజి 19 కింద జిల్లాలో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని కేసీఆర్ పై కోపంతో పనులు ఆపేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ప్రభుత్వాలు మారినా పనులు ఆపడం సరైనది కాదన్నారు. కాళేశ్వరం కాలువ పనులను అపొద్దని మేము కోరుతున్నామని అన్నారు. సీఎం జిల్లాకి వస్తున్నారంటే ఆడబిడ్డగా మాకేమైన వరాలు ఇస్తాడేమో అనుకున్నామన్న కవిత నెలకు 2500, తులం బంగారం ఇస్తాడేమో అని మహిళలు అనుకున్నారు..కానీ ఏమీ లేదన్నారు. పింఛన్ 4 వేలు ఇస్తామన్నారు…ప్రతి 18 ఏళ్ల ఆడపిల్లకు స్కూటీ ఇస్తామన్నారని తెలిపారు.

మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె ఆరోపించారు. కేసీఆర్ కిట్లు అడబిడ్డలకు ఇస్తలేరని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40 శాతం నేరాలు పెరిగాయన్నారు. కిడ్నప్ కేసులు ఎక్కువయ్యాయన్నారు. మహిళల భద్రతపై సీఎంకి సోయి లేదని మండిపడ్డారు. రైతులకు రైతు బంధు లేదని సంక్రాంతికి ఇస్తామన్న రైతు బంధు కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు. చిన్న స్థాయి ఉద్యోగులకు రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాల వరికి బోనస్ ఇస్తామని సన్న వడ్లకే అని మాట మార్చారన్నారు.