ప్రశ్నించకపోతే ఏమీ జరగదు… ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉంది: MLC కవిత
యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఓట్లు వేసినప్పుడే ప్రశ్నించే హక్కు వస్తుందన్నారు.
MLC KAVITHA: ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా విద్యార్థులు, కొత్త ఓటర్లతో ఎమ్మెల్సీ కవిత ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉందని అన్నారు. ప్రశ్నించకపోతే ఏమీకాదని అన్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు అత్యంత శక్తి మంతమైనది. ఓటు వేయకపోతే అడిగే హక్కును కూడా మీరు కోల్పోతారు. పట్టణాల్లో తక్కువగా పోలింగ్ అవుతోంది. గ్రామాల్లో ఓటింగ్ పెరుగుతోంది. ఎన్నికలంటే పట్టణ యువత ఆషామాషీగా తీసుకోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. మీ సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాలని యువతను కోరారు. ఎన్నికలతో మాకు సంబంధం లేదు అనే ఆలోచన పెట్టుకోవద్దన్నారు.
తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే, దేశ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు.. దేశాన్ని కాపాడుతున్నారు. యువత ఇక్కడ నిలబడి ఎందుకు ఓట్లు వేయడం లేదని ప్రశ్నించారు. దేశం అభివృద్ధి జరగాలంటే.. యువత కూడా ఓటింగ్ లో పాల్గొనాలని కవిత కోరారు. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా తయారవుతుదని చెప్పారు.