ED VS MLC Kavitha : ED కి MLC కవిత సవాల్.. ఎల్లుండి కోర్టులో తేల్చుకుందాం.. ఉత్కంఠలో BRS శ్రేణులు
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Case) కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఎట్టకేలకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Case) కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఎట్టకేలకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case) లో తన అరెస్ట్ అక్రమమంటూ ఆమె కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిల్ లో ఈడీ (ED) అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులు కొట్టేసి.. తనను విడుదల చేసేలా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. దీంతో కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై ఈనెల శుక్రవారం విచారణ జరగనుంది. ప్రస్తుతం కవిత దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్,జస్టిస్ బేలా ఎం త్రివేదిల త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. మరో రెండు రోజుల్లో కవిత పిటిషన్ పై విచారణ చేపట్టడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఈ పిటిషన్ లో కవిత ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్ విచారణలో… సుప్రీం కోర్టు కవిత రిమాండ్ ను కోర్టు కొట్టేస్తుందా.. లేక అరెస్ట్ ను సమర్థిస్తుందా అని వేచిచూడాలి.