MLC Kavitha: కవిత ఫోనే కీలకం..కేస్ మొత్తం ఫోన్ చుట్టూనే..!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ఒక సంచలనంగా మారింది.
లిక్కర్ కేస్ లో ఈడీ విచారణ మొత్తం కవిత మొబైల్ ఫోన్ చుట్టూ తిరుగుతుంది. లావాదేవీలు కానీ…ఒప్పందాలు..మాటలు అన్ని కవిత ఫోన్ ద్వారానే జరిగాయని ఈడీ అనుమనిస్తోంది. ప్రధానంగా 2ఏళ్లలో కవిత 10 ఫోన్లు మార్చింది. మార్చిన 10 ఫోన్లు ధ్వమ్ సం చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఇప్పుడు అదే దారిలో ఈడీ కూడా ఆలోచిస్తుంది. అనూహ్యంగా ఈడీ విచారణ జరుగుతున్న సమయంలో మధ్యలో కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్ ఎక్కడని అడిగారు ఈడీ అధికారులు.
వెంటనే ఈడీ రిసెప్షన్ లో ఉన్న తన ఫోన్ తీసుకొచ్చి అధికారులకు అప్పజెప్పారు కవిత. ఆ ఫోన్ లో సమాచారాన్ని మొత్తం డీకోడ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఫోన్ కాల్ లిస్ట్ , వాట్సాప్ చాటింగ్ కూడా సేకరిస్తారు. అయితే కవిత ఇప్పటివరకు ధ్వంసం చేసిన ఫోన్లు తిరిగి ఇవ్వకపోయినా వాటి డేటా సేకరించడం ఈడీ కి సీబీఐ కి పెద్ద పని కాదు. కవిత తన ఫోన్ ద్వారానే రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, రాఘవ, శరత్ రెడ్డి తో చాటింగ్ చేసి ఉంటారని,అలాగే ఆమెకు ఇస్తామన్న33 శాతం వివరాలు చాట్ ద్వారా తెలియవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి లేక పోతే తరచు ఫోన్స్ మార్చడం, వాటిని ధ్వంసం చేయడం.. ఎందుకు చేస్తారని అనుమనిస్తున్నాయి. సో కవిత ఫోన్ ఇప్పుడు కేస్ లో కీలకం కానుంది.