PM Narendra Modi 3.0 : ఇవాళ మోడీ 3.O తొలి కేబినెట్ సమావేశం..
నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ నేతలకు మంత్రులు వారి వారి శాఖలను కేటాయించే అవకాశం ఉంది. లేదంటే కేబినెట్ మీటింగ్ లోనే శాఖల కేటాయింపుపై చర్చలు జరిపీ.. శాఖల కేటాయించే తేదీ వెలువడనుంది.

Modi 3.O first cabinet meeting today..
కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ (Narendra Modi) కేబినెట్ తొలి సమావేశం ఇవాళ జరగనునంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోకకళ్యాణ్ మార్గ్ ఉన్న ప్రధాని నివాసంలో కేబినెట్ సభ్యులు భేటీ కానున్నారు.
నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ నేతలకు మంత్రులు వారి వారి శాఖలను కేటాయించే అవకాశం ఉంది. లేదంటే కేబినెట్ మీటింగ్ లోనే శాఖల కేటాయింపుపై చర్చలు జరిపీ.. శాఖల కేటాయించే తేదీ వెలువడనుంది.
దేశంలోని ప్రధాన మంత్రి శాఖతో పాటుగా.. ఫైనాన్స్, హోం, డిఫెన్స్, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలు బీజేపీ దగ్గరే ఉండనున్నట్లు.. గతంలో ఉన్న వారికే ఈ శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం.. కేంద్ర కేబినెట్ లో మొత్తం 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంకా 9 మంత్రుత్వ శాఖలు ఖాలీగా ఉన్నట్లు వాటిని విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
100 రోజుల పాలనపై కేంద్రం కార్యాచరణ సిద్ధం..
దేశంలో కొలువుదీరిన బీజేపీ సర్కార్ (BJP Sarkar) సంచలన నిర్ణయం తీసుకున్నది. దేశ పరిపాలనలో తొలి 100 రోజుల కార్యాచరణపై నేడు చర్చించనున్నది. ప్రజలకిచ్చిన హామీలపై కేంద్ర కేబినెట్ (Central Cabinet) సమావేశం కానున్నది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నది. మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి సమావేశం కాగా.. భేటీలో రాబోయే పార్లమెంట్ సమావేశాలపై కూడా చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది.