MODI KA PARIVAR: అప్పుడు చౌకీదార్.. ఇప్పుడు పరివార్.. లాలూ మాటలను ఆయుధంగా మార్చుకున్న బీజేపీ..
ఇప్పుడు దేశం మొత్తం మీద మోడీ కా పరివార్ ట్రెండింగ్ నడుస్తోంది. బీజేపీ అగ్రనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. తమ సోషల్ మీడియా ఖాతాల్లో, స్టేటస్‌లలో తామంతా మోదీ కా పరివార్ అని ప్రకటించుకుంటున్నారు.
MODI KA PARIVAR: టైమ్ బాగున్న వాడితో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే.. మన టైమ్ బాలేకుండా పోతుంది. ఇప్పుడు దాదాపు మోదీ పరిస్థితి కూడా అదే. ప్రధానికి కుటుంబం లేదంటూ ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్ ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. ఈ మాటను అందుకొని విపక్షాలను ఓ ఆట ఆడుకుంటున్నారు మోదీ. లాలూ ప్రసాద్ మాట్లాడిన మాటలు.. ఇప్పుడు బీజేపీ నేతలకు ఆయుధంగా మారింది. 2019 ఎన్నికల సమయంలోనూ ఇలానే చౌకీదార్ అనే పేరును బీజేపీ నేతలు బలంగా జనాల్లో తీసుకెళ్లారు. సూపర్ బ్రాండ్ క్రియేట్ చేశారు. తాను ఈ దేశాన్ని కాపాడే చౌకీదార్‌ను.. అంటే కాపాలదారున్ని అంటూ ప్రసంగాల్లో పదేపదే చెప్పిన మోదీ.. జనాల మనసు గెలుచుకున్నారు.
KCR: నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
అప్పుడు కూడా మోదీ మాటను.. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలో అయ్యారు. తమ అకౌంట్ల ముందు చౌకీదార్ అని చేర్చారు. 2024 ఎన్నికల ముందు కూడా సరిగ్గా అదే సీన్ కనిపిస్తోంది. ఇప్పుడు మోడీకా పరివార్ నినాదంతో ఈ ఎన్నికల్లో తనకు అనుకూల పవనాలను క్రియేట్ చేసుకుంటున్నారు మోదీ. ఇప్పుడు దేశం మొత్తం మీద మోడీ కా పరివార్ ట్రెండింగ్ నడుస్తోంది. బీజేపీ అగ్రనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. తమ సోషల్ మీడియా ఖాతాల్లో, స్టేటస్‌లలో తామంతా మోదీ కా పరివార్ అని ప్రకటించుకుంటున్నారు. తన కుటుంబం గురించి మోదీ చాలాసార్లు బహిరంగసభల్లో చెప్పారు. ఆ మధ్య హైదరాబాద్‌లోనూ ఇలాంటి మాటే మాట్లాడారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని.. తనకు కుటుంబం లేదని.. దేశం కోసం కుటుంబాన్ని వదులుకున్నానని.. దేశం కోసమే బతుకుతున్నానని.. దేశమే తన కుటుంబం అని చెప్పారు. ఇలాంటి విషయాన్ని దెప్పిపొడిచేలా.. లాలూ కామెంట్లు చేయడం బీజేపీకి ఆయుధంగా మారింది. గతంలో చంద్రబాబు కూడా కూడా కుటుంబం విషయంలో.. మోదీని కామెంట్ చేశారు. మోదీకి భార్య లేదు, పిల్లలు లేరు, సంసారం లేదని తిట్టి చేతులు కాల్చుకున్నారు.
ఇప్పుడు లాలూ వంతు వచ్చింది. కుటుంబం అనే సెన్సిటివ్ టాపిక్‌ను రెయిజ్ చేసి.. ఇప్పుడు లాలూ చేతులు కాల్చుకోవడమే కాదు.. బీజేపీకి ఓ ఆయుదం అందించారు. లాలా కామెంట్స్‌ను బీజేపీ తెలివిగా వాడుకుంటోంది. మోదీ కీ పరివార్ నినాదంతో.. దేశంలో కొత్త ప్రచారాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చింది. కర్మ కలిసి రానప్పుడు ఇదిగో ఇలానే తయారవుతాయి. లాలూప్రసాద్ యాదవ్ నోటి దూల పుణ్యమా అని.. ఇండియా కూటమికి ఇప్పుడు మోదీ కా పరివార్ వ్యవహారం టెన్షన్ రేపుతోంది. బలవంతున్ని అయినా గెలవొచ్చు.. అదృష్టవంతుడిని, టైమ్ బాగున్నోన్ని గెలవడం కష్టం అనే మాట నిజమవుతోంది. బీజేపీలాంటి పార్టీని ఢీకొట్టేందుకు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసి.. ఫైట్ చేయాలని రెడీ అయినప్పుడు.. ఇలాంటి జారుడు మాటలు వదిలితే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది.