Madiga Vishwaroopam Sabha : నేడు తెలంగాణలో మరోసారి మోదీ పర్యటన.. మాదిగల విశ్వరూప మహా సభకు మోదీ హాజర్..

ఇవాళ మధ్యాహ్నం 2.35 నిముషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యే విమానంలో హైదరాబాద్ కు బయలుదేరి సాయంత్రం 4.45కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రోడ్ షో ద్వారా పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 5.40 వరకు బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2023 | 10:04 AMLast Updated on: Nov 11, 2023 | 10:04 AM

Modis Visit To Telangana Once Again Today Modi Will Attend The Madigala Vishwarupa Maha Sabha

అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections)  సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెలలో ఇది రెండో సారి మోదీ (PM Modi)  పర్యటన. ఇదివరకే.. హైదరాబాద్ లోని ఎల్బీ స్టెడీయంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు మోదీ.. మళ్లీ ఈరోజు మాదిగల విశ్వరూప మహా సభకు (Madiga Vishwaroopam Sabha)  హాజరుకానున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2.35 నిముషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యే విమానంలో హైదరాబాద్ కు బయలుదేరి సాయంత్రం 4.45కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రోడ్ షో ద్వారా పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 5.40 వరకు బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.ఇక మళ్ళీ ఈ నెలలో ప్రధాని మూడో పర్యటన ఉంటుందని.. ఈ నెల 26న నిర్మల్ లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని సమాచారం.
అంతేకాకుండా.. రాష్ట్ర బీజేపీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు సైతం ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్న మాట.

ఈ సభలో రాష్ట్రంలో ఉన్న ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా ప్రధాని మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతటా ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 80% ఉన్న ఓటు బ్యాంక్ ని తమ బ్యాలేట్ వేసుకునేందుకే ఈ బీసీ. మాదిగ విశ్వరూప మహా సభలు పెడుతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట..