Pavitranath: మొగలి రేకులు ఫేం పవిత్ర నాథ్ మరణానికి కారణాలివే..

గతంలో ఒకసారి అతడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. కొంతకాలం ముందు నుంచి కూడా అతడు సన్నిహితులకు, టీవీ రంగంలోని వారికి కూడా దూరంగా ఉంటున్నాడట. ఈ క్రమంలో అటు సీరియల్ అవకాశాలు లేక.. ఇటు వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా పవిత్రనాథ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2024 | 08:07 PMLast Updated on: Mar 03, 2024 | 8:09 PM

Mogalirekulu Serial Fame Pavitranath Died Due To This Reason

Pavitranath: మొగలి రేకులు సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ మరణం ఆయన అభిమానుల్ని, టీవీ వీక్షకుల్ని కలచివేస్తోంది. ఆ సీరియల్‌లో దయ పాత్ర ద్వారా ఎంతోమందికి చేరువయ్యాడు పవిత్ర నాథ్. ఆ తర్వాత చక్రవాకం సీరియల్ కూడా పవిత్రకు పేరు తెచ్చింది. దీంతో టీవీ రంగంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాడనుకున్న ఆయన.. ఉన్నట్లుండి బుల్లితెరకే దూరమయ్యారు. దీనంతటికీ వ్యక్తిగత, వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యలే కారణంగా తెలుస్తోంది.

Ysrcp Manifesto: ‎వైసీపీ మేనిఫెస్టో ఆ రోజేనా.. వరాలు కురిపిస్తారా.?

ఇక.. ఉన్నట్లుండి ఆయన ఎందుకు మరణించారని చాలా మంది ఆరాతీస్తున్నారు. పవిత్ర నాథ్ 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, కొంతకాలం క్రితం అతడిపై భార్య శశిరేఖ ఆరోపణలు చేసింది. తనను పవిత్రనాథ్, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. పిల్లల్ని కూడా కొట్టేవాడని విమర్శించింది. అలాగే అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని, చాలాకాలంగా తనను వేధిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఒకసారి అతడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పట్నుంచి అతడు అనారోగ్య  సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. కొంతకాలం ముందు నుంచి కూడా అతడు సన్నిహితులకు, టీవీ రంగంలోని వారికి కూడా దూరంగా ఉంటున్నాడట. ఈ క్రమంలో అటు సీరియల్ అవకాశాలు లేక.. ఇటు వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా పవిత్రనాథ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతోమానసిక ఒత్తిడి, కుటుంబ కలహాల కారణంగా అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది.

ఒత్తిడి కారణంగా మద్యానికి బానిస అయ్యాడట పవిత్ర నాథ్. అతని లివర్లు కూడా బాగా డ్యామేజ్ అయ్యాయని.. ఆరోగ్యం బాగా క్షీణించడంతోనే చనిపోయాడని అతని సన్నిహితులు అంటున్నారు.ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించింది. దీంతో హార్ట్ ఫెయిల్యూర్ అయి మరణించాడని అతడి సన్నిహితులు తెలిపారు.