Mohammed Siraj: సిరాజ్‌కు ఏమైంది.. భారీగా రన్స్ ఇచ్చేస్తున్న పేసర్..
ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని భజ్జీ సూచించాడు.
Mohammed Siraj: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే సిరాజ్ దారుణంగా విఫలమవుతున్నాడు. వికెట్లు విషయం పక్కన పెడితే రన్స్‌ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ 57.25 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
JANASENA YOUTUBE: జనసేన యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఇది ఎవరి పని..?
ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని భజ్జీ సూచించాడు. సిరాజ్ మానసికంగా, ఫిజికల్‌గా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడన్నాడు. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడనీ, విశ్రాంతి ఇస్తే మంచిదన్నాడు. ఏమి జరుగుతుందో ఆర్ధం చేసుకోవడానికి అతడికి ఆ సమయం ఉపయోగపడుతోందని చెప్పుకొచ్చాడు. సిరాజ్ అద్బుతమైన బౌలర్ అని, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతడి స్పెషల్ టాలెంట్ అన్నాడు.
ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లు సిరాజ్‌కు పీడకలగా మిగిలాయన్నాడు. అందుకే రెస్ట్ ఇస్తే అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని హర్భజన్ అభిప్రాయ పడ్డాడు. గతంలో తాను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నాడు. మరి భజ్జీ సూచనపై ఆర్సీబీ మేనేజ్ మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.