దుబాయ్ పారిపోయిన పెదరాయుడు… అయినా వెంటాడుతున్న పోలీసులు

సినిమా పరిశ్రమలో మోహన్ బాబు ఫ్యామిలీ కంప్లీట్ గా డిఫరెంట్. అందరిదీ ఒకదారైతే వీళ్ళ ఫ్యామిలీ ఇది మరో దారి. ఎప్పుడు ఏం చేస్తారో... అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో... మీడియా ముందు ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 01:02 PMLast Updated on: Jan 02, 2025 | 1:02 PM

Mohan Babu Travelling To Dubai 2

సినిమా పరిశ్రమలో మోహన్ బాబు ఫ్యామిలీ కంప్లీట్ గా డిఫరెంట్. అందరిదీ ఒకదారైతే వీళ్ళ ఫ్యామిలీ ఇది మరో దారి. ఎప్పుడు ఏం చేస్తారో… అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో… మీడియా ముందు ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇటీవల జరిగిన వ్యవహారాలు అయితే ఆ కుటుంబ పరువునే కాకుండా సినిమా పరిశ్రమ పరువును కూడా తీశాయి. అయితే ఇప్పుడు మోహన్ బాబుని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు పోలీసులు అనేదానిపై మీడియా వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది.

ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడం… కోర్టు ఇచ్చిన రిలీఫ్ కూడా ఇప్పటికే కంప్లీట్ కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మోహన్ బాబు ఉన్నారు. అయితే ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే మోహన్ బాబు దుబాయ్ పారిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియకపోవడం ఒకవేళ పోలీసులు అరెస్టు చేస్తే పరువు పోతుందనే భయం మోహన్ బాబు లో ఎక్కువగా ఉంది. ఇప్పటికే మంచు మనోజ్ వివాదంతో మోహన్ బాబు రోడ్డును పడ్డారు. మీడియా ప్రతినిధిని రోడ్డుపైనే కొట్టడం వివాదం అయింది.

ఆ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రికి వెళ్లి మరి క్షమాపణలు కూడా చెప్పారు. ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు షాక్ ఇవ్వడంతో తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేసిన అది ఎందుకో ఆగిపోయింది. ఇక ముందస్తు జాగ్రత్తగా దుబాయ్ వెళ్లిపోయినట్టు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మోహన్ బాబు తన వద్ద ఉన్న గన్ ను కూడా చంద్రగిరి పోలీసులకు సరెండర్ చేసారు. మోహన్ బాబు ఫ్యామిలీ ఎక్కువగా దుబాయ్ వెళుతూ ఉంటుంది. రీసెంట్ గా మంచు విష్ణు కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు.

అయితే ఇప్పుడు మోహన్ బాబు మంచు విష్ణు ఇద్దరు దుబాయ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ కూడా ఎక్కడా తగ్గకపోవడంతో మోహన్ బాబు అలాగే విష్ణు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. సినిమా వాళ్ళ విషయంలో ఎప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక భయం భయంగా బ్రతుకుతున్నారు. అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు కాబట్టి తనను కూడా అరెస్టు చేస్తారనే క్లారిటీ మోహన్ బాబు లో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు అరెస్ట్ నుంచి తప్పించుకున్న మోహన్ బాబు… ఇప్పుడు మాత్రం ఆయన కచ్చితంగా అరెస్టు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే రీసెంట్ గా చంద్రగిరిలో మోహన్ బాబు కనిపించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.