మోహన్ బాబు అరెస్ట్ పక్కా… తగ్గే ఛాన్స్ లేదన్న రేవంత్
తెలంగాణలో ఇప్పుడు సినిమా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. గతంలో రెచ్చిపోయిన సినిమా వాళ్ళు ఇప్పుడు దాదాపుగా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సెన్సేషన్ అయింది.
తెలంగాణలో ఇప్పుడు సినిమా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. గతంలో రెచ్చిపోయిన సినిమా వాళ్ళు ఇప్పుడు దాదాపుగా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సెన్సేషన్ అయింది. ఇప్పుడు మంచు కుటుంబం పై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. వారం రోజుల క్రితం మంచి ఫ్యామిలీలో జరిగిన రచ్చ అంతా కాదు. ఈ రచ్చ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. సినిమా పరిశ్రమ పరువు తీశారని సినిమా వాళ్లు కూడా సీరియస్ గానే ఉన్నారు.
ఇక మోహన్ బాబు తన ఇంటికి వచ్చిన మీడియా ప్రతినిధులతో గత మంగళవారం వ్యవహరించిన వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అదేరోజు సాయంత్రం మీడియా ప్రతినిధులపై వారి మైక్ తీసుకుని వారిపైనే దాడికి దిగారు. ఈ దాడిలో రంజిత్ అనే ఒక రిపోర్టర్ గాయపడ్డాడు. దీనిపై తెలంగాణ పోలీసులు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసారు. దీనితో మోహన్ బాబుని ఏ క్షణమైనా సరే అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే మోహన్ బాబు గత కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి.
ఇదే టైంలో ఆయన సోమవారం వరకు అరెస్టు చేయొద్దని కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు మోహన్ బాబు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైకోర్టులో బలమైన వాదనలను వినిపించింది. దీనితో హైకోర్టులో ఆయనకు చుక్క ఎదురయింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫడవిట్ లో దాఖలు చేయాలని కోరింది కోర్టు. అప్పుడే ఏదైనా తేల్చితామని తెలిపిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించలేదు.
ఇక జల్పల్లిలో తన నివాస వద్ద జరిగిన ఘటనపై మోహన్ బాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఉదేశపూర్వకంగా తాను జర్నలిస్టును కొట్టలేదని అనుకోకుండా జరిగిన పొరపాటు అని జర్నలిస్టులకు క్షమాపణ కూడా చెప్పారు. ఇక సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జర్నలిస్టులు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పి ఫోటోలు కూడా దిగి వచ్చారు. ఇప్పటికే మోహన్ బాబు తన లైసెన్స్ గన్ ను కూడా సరెండర్ చేశారు. తన పిఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించేశారు. కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాల ఇప్పుడు ఏ మలుపు తిరుగుతాయో అనే ఆందోళన కూడా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం మోహన్ బాబును అరెస్టు చేయడం ఖాయం అనే అభిప్రాయం వినపడుతోంది. రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నారట. సాక్ష్యాలను కూడా పోలీసులు పూర్తిగా సేకరించి పెట్టుకున్నారు.