Google Most Searches in India: గూగుల్ లో ఎక్కువ వెతికిన సమాచారం ఏదో తెలుసా ?
ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా ఏ పదాలను జనం వెతుకుతున్నారో గూగుల్ సెర్చింజన్ ప్రకటించింది. అందులో ఈసారి ఇండియాకు చెందిన న్యూస్ ఒకటి వార్తల్లో నిలిచింది. అదేంటో మీరే చదవండి
Google Most Searches in India: మనకు ఏ డౌట్ వచ్చినా సరే… వెంటనే గూగుల్ లో వెతికేస్తున్నాం. కొన్ని సెకన్లలోనే మనకు కావల్సిన సమాచారం దొరుకుతోంది. చిన్నదైనా… పెద్దదైనా అనుమానం తీరాలంటే గూగుల్ లో వెతకాల్సింది. ఇయర్ ఎండ్లో అత్యధికంగా వెతికిన అంశాలు ఏంటో…. ప్రతి ఏడాది గూగుల్ ప్రకటిస్తోంది.
Cheating @Raydurgam : రాయదుర్గంలో ఘరానా మోసం.. 100 కోట్ల కంపెనీ కొట్టేసిన కేటుగాళ్ళు !
2023నకు సంబంధించిన మోస్ట్ సెర్చ్ జాబితా కూడా తాజాగా గూగుల్ రిలీజ్ చేసింది. ఇందులో అత్యధికంగా ఇండియాకు చెందిన అంశాల్లో చంద్రయాన్ 3 మొదటి స్థానంలో నిలిచింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది శోధించిన అంశం ఇదే. గూగుల్ లిస్ట్ ప్రకారం.. ఈ ఏడాది భారతదేశానికి సంబంధించిన వార్తల్లో చంద్రయాన్ 3 టాప్ వన్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్, ఇజ్రాయేల్ న్యూస్, సతీస్ కౌశిక్ మృతి ఉన్నాయి. ఆ తర్వాత 2023 బడ్జెట్, టర్కీలో భూకంపం, అతిక్ అహ్మాద్, నటుడు మ్యాథ్యూ పెర్రీ, మణిపూర్ ఘటనకు సంబంధించిన అంశాలు, ఒడిస్సా రైలు ప్రమాదం.. లాంటి సంఘటనలు ఇండియన్ టాప్ మోస్ట్ సెర్చ్ అంశాలుగా నిలిచినట్టు గూగుల్ తెలిపింది.