కూతురు హత్యకు తల్లి సుపారీ రివర్స్ లో తల్లినే చంపిన కూతురు ప్రియుడు
అమ్మా లేదు...నాన్న లేడు...అక్కా చెల్లి...తమ్మి లేడు ఏక్ నిరంజన్ అనే పాట ఉంది. బంధాల్లేవ్... బంధుత్వాల్లేవ్... రక్తసంబంధం అంతకన్నా లేదు. ఇప్పుడంతా డబ్బు చుట్టే రిలేషన్లు నడుస్తున్నాయి. ప్రేమించిన వారికి అమ్మైనా...నాన్నైనా...తోడబుట్టిన వారైనా సరే...చంపేస్తున్నారు.
అమ్మా లేదు…నాన్న లేడు…అక్కా చెల్లి…తమ్మి లేడు ఏక్ నిరంజన్ అనే పాట ఉంది. బంధాల్లేవ్… బంధుత్వాల్లేవ్… రక్తసంబంధం అంతకన్నా లేదు. ఇప్పుడంతా డబ్బు చుట్టే రిలేషన్లు నడుస్తున్నాయి. ప్రేమించిన వారికి అమ్మైనా…నాన్నైనా…తోడబుట్టిన వారైనా సరే…చంపేస్తున్నారు. తమ ప్రేమకు అడ్డు రాకుండా హత్యలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి హత్యలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రేమించిన వాడి కోసం కన్న తండ్రినే… కూతురు చంపేసింది. హైదరాబాద్ లో ప్రియుడి కోసం తన తల్లినే ప్రియుడితో కలిసి మట్టుబెట్టింది ప్రియురాలు.
పైవన్నీ ఒకెత్తయితే…నల్గొండ జిల్లాల్లో జరిగిన పరువు హత్య మరో ఎత్తు. నల్గొండ జిల్లాలో ప్రణయ్ హత్యను ఎవరు మరచిపోలేరు. తన కూతుర్ని ప్రేమించి…పెళ్లి చేసుకున్న యువకుడ్ని చంపాలంటూ…వ్యాపారి మారుతిరావు సుపారీ ఇచ్చాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అలాంటిదే…ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లాలోనూ జరిగింది. ఆల్కా అనే 42 మహిళకు 17 ఏళ్ల కూతురు ఉంది. ఈ వ్యవహారం కన్న తల్లికి తెలిసింది. దీంతో కన్న కూతుర్ని చంపించేందుకు సుపారీ గ్యాంగ్ ను ఆశ్రయించింది. గ్యాంగ్ తో మాట్లాడింది. సుభాష్ సింగ్ తో సుపారీ మాట్లాడుకున్న ఆల్కా…అడ్వాన్స్ గా కొంత సొమ్మను కూడా ముట్టజెప్పింది. అతుడు కొంతకాలం క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక్కడే ట్విస్టు ఉంది. తన కూతురికి లవ్ ఎఫైర్ ఉందన్న విషయం మాత్రమే తెలుసు. ఆమె ప్రియుడు ఎవరు అన్నది మాత్రం ఆల్కాకు తెలియదు.
ఆల్కా ఇక్కడే తప్పులో కాలేసింది. కూతురు ప్రియుడు ఎవరన్నది తెలుసుకోలేకపోయింది. గుడ్డిగా సుభాష్ సింగ్ ను సంప్రదించింది. ఆల్కా సంప్రదించడం, 50 వేలకు సుపారీ ఇచ్చిన విషయాన్ని తన ప్రియురాలికి చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి ఓ ప్లాన్ వేశారు. ఆల్కా కూతురు, ఆమె ప్రియుడు సుభాష్ సింగ్ కలిసి…సుపారీ ఇచ్చిన ఆల్కానే చంపేశారు. ఈ నెల 6వ తేదీన ఆల్కాను…పొలంలో గొంతు కోసి చంపేశారు. భార్య ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆల్కా భర్త రమాకాంత్…పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…కూతురి లవ్ ఎఫైర్ గురించి తెలుసుకున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడ్డాయి.
పోలీసుల దర్యాప్తులో ఏం తేలిదంటే….అత్యాచారం కేసులో శిక్ష అనుభవించి…ఇటీవల జైలు నుంచి వచ్చిన సుభాష్ అనే వ్యక్తికే…తన కుమార్తెను హత్య చేయాలని సంప్రదించింది. అప్పటికే సుభాష్‌కి అల్కా కూతురికి మధ్య ఉన్న వ్యవహారం గురించి…అల్కాకి తెలియదు. అల్కా ప్లాన్ గురించి తెలుసుకున్న సుభాష్ సింగ్…మొత్తం ప్రియురాలికి చెప్పేశాడు. సుభాష్‌ని పెళ్లి చేసుకునేందుకు తన తల్లిని చంపేయాలని ఒప్పించింది ఆల్కా కూతురు. ఇద్దరు కలిసి అల్కాని చంపేందుకు ప్లాన్ చేశారు. సుభాష్ ముందుగా అల్కాను చంపినట్లు నాటకమాడాడు. ఒప్పందం కుదర్చుకున్నట్లు అల్కాని మిగిలిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సుభాష్, ఆల్కా…ఆగ్రాలో కలుసుకున్నారు. అక్కడే తన కుమార్తెను సుభాష్ చంపలేదనే విషయం అల్కాకి తెలిసింది. ఆల్కా, ఆమె కూతురు, సుపారీ కిల్లర్ కమ్ ఆల్కా కూతురు ప్రియుడు కలిసి…ఎటా జిల్లాకు బయలుదేరారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు కలిసి అల్కాని గొంతు కోసి చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించిన కూతుర్ని. ఆమె ప్రియుడు, హంతకుడు సుభాష్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.