Motkupalli Narasimhulu: చంద్రబాబును చంపే ప్లాన్ నడుస్తోంది.. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిసనగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మొత్కుపల్లి నర్సింహులు దీక్ష చేస్తున్నారు.

Motkupalli Narasimhuli Shocking Comments On ycp Party
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిసనగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మొత్కుపల్లి నర్సింహులు దీక్ష చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన అనుచరులతో ఆయన దీక్షకు దిగారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఎక్కడా రూల్స్ పాటించకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్ట్ జరిగిందన్నారు. చంద్రబాబు జైల్‌లో అనుభవిస్తున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. చంద్రబాబును జైల్‌లోనే చంపాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నాడంటూ చెప్పారు.
చంద్రబాబు ఒక్కడు లేకపోతే ఏపీలో ఒక తనకు అడ్డు ఉండదని జగన్ భావిస్తున్నారంటూ కామెంట్ చేశారు. జగన్ కారణంగా చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందంటూ చెప్పారు. ఎప్పుడు ఎవరిని ఎలా అడ్డు తొలగించుకోవాలి అనే విషయంలో జగన్ చాలా నేర్పరి అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కుటుంబానికి రాష్ట్రం మొత్తం అండగా నిలవాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. త్వరలనే తాను కూడా వెళ్లి భువనేశ్వరిని స్వయంగా కలుస్తానంటూ చెప్పారు. మోత్కుపల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.