TONIQUE LIQUOR CASE: సంతోషా ఏంటి అరాచకం.. టానిక్ కేసులో అడ్డంగా దొరికేశాడుగా..!
టానిక్ స్కాం మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కుదిపేస్తోంది. ఇందులో సంతోష్ రావు ప్రమేయం ఉందని ఎక్సైజ్ అధికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించారు. దాంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి కుంభకోణాల్లో మరొకటి బయటపడింది.
TONIQUE LIQUOR CASE: టానిక్ లిక్కర్ కేసులో ఎంపీ సంతోష్ రావు అండ్ గ్యాంగ్ అరాచకాలు తవ్వితీస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బినామీల పేర్లతో టానిక్ లిక్కర్ మార్ట్‌ను సంతోష్ రావు నడిపించినట్టు బయటపడింది. ఎన్నికలకు ముందే ఈ లిక్కర్ మార్ట్ యాజమాన్య హక్కులు బదిలీ చేయించుకొని భారీగా అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. సాధారణ మద్యం లైసెన్స్‌తో ఫారిన్ లిక్కర్ అమ్మడమే కాకుండా.. వంద కోట్ల దాకా ట్యాక్సులు ఎగ్గొట్టినట్టు అధికారులు గుర్తించారు. టానిక్ స్కాం మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కుదిపేస్తోంది. ఇందులో సంతోష్ రావు ప్రమేయం ఉందని ఎక్సైజ్ అధికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించారు.
Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి.. రాష్ట్రపతి కోటాలో ఎంపిక
దాంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి కుంభకోణాల్లో మరొకటి బయటపడింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్ సోదాల్లో సంచలన విషయాలు బయట పడ్డాయి. టానిక్ గ్రూప్ కింద మొత్తం 11 వైన్ మార్టులు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు శివారుల్లోనూ ఈ షాపులను ఏర్పాటు చేశారు. ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్‌లో గత 6 ఏళ్లలో వెయ్యి కోట్ల రూపాయలకుపైగా అమ్మకాలు జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మిగతా 10 వైన్ షాప్స్ లెక్కలను కూడా GST, ఎక్సైజ్ అధికారులు సేకరిస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా జీవో విడుదల చేసారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ అడ్రస్‌తో అమిత్ రాజ్, లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ దీనికి లైసెన్స్ జారీ అయింది. ప్రభుత్వం మనదే.. ఏం చేసినా చల్తా హై అనుకున్నారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో.. స్పెషల్ జీవోలు విడుదల చేసి మరీ.. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్‌కు కల్పించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ షాప్‌కి ఇచ్చిన మినహాయింపులపై దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.
Radhika Merchant: రాధికా ప్రీ వెడ్డింగ్ స్పీచ్.. ఆ మూవీ నుంచి కాపీ కొట్టిందా..?
టానిక్ ఎలైట్ వైన్ షాప్‌ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు ఎక్సైజ్ శాఖ, GST అధికారులు.. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ గోదాముల నుంచి షాపులకు మద్యం నిల్వలు తీసుకెళ్లే వ్యాపారులు ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను బిల్లులపై రాయాలి. కానీ టానిక్ గ్రూప్‌నకు వ్యాట్ ప్రస్తావన లేకుండానే మద్యం నిల్వలు.. ఏళ్ల తరబడిగా వెళ్తున్నా BCL ఎనాడూ పట్టించుకోలేదు. మద్యం కొనేవాళ్ళకి ఇచ్చే రసీదులను మాత్రం GST నంబరుతోనే జారీ చేస్తున్నట్టు తనిఖీల్లో బయటపడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాల రసీదులో వ్యాట్ వివరాలు మాత్రమే ఇవ్వాలి. జీఎస్టీ కింద మద్యం అమ్మకాలు లేవు. అయినా GST పేరుతో జనం నుంచి డబ్బులు ఎలా వసూలు చేశారు. 6 యేళ్ళల్లో ఎంత కలెక్ట్ చేశారన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఈ మార్ట్స్‌లో ఫుడ్ ఐటెమ్స్ సేల్స్‌కి ప్రభుత్వ అనుమతి లేదు. అయినా వాటిని అమ్ముతూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు బయటపడింది. అధికారంలోకి రాకముందే రేవంత్ రెడ్డి టానిక్ వైన్ షాప్‌ల కుంభకోణంపై ఆధారాలు సేకరించారు. సీఎం అయ్యాక KCR ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాముల లిస్టులో టానిక్ లిక్కర్‌ని కూడా చేర్చినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ టైమ్ చూసి ఆగమేఘాల మీద ఈ కేసును ఎంక్వైరీ చేయించారు. టానిక్ స్కాం దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసును పర్వవేక్షిస్తున్నట్లు సమాచారం.