Naveen Reddy : ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు..
మిస్టర్ టీ ఫౌండర్ (Mr T Founder).. నవీన్ రెడ్డి (Naveen Reddy) ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ (Jabardasth) కమెడియన్‌ని పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు ఈ యంగ్ బిజినెస్ మ్యాన్. వైశాలి రెడ్డి (Vaishali Reddy) కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.

Mr. T founder who is finally a homebody.. Naveen Reddy
మిస్టర్ టీ ఫౌండర్ (Mr T Founder).. నవీన్ రెడ్డి (Naveen Reddy) ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ (Jabardasth) కమెడియన్‌ని పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు ఈ యంగ్ బిజినెస్ మ్యాన్. వైశాలి రెడ్డి (Vaishali Reddy) కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. ఆమె కిడ్నాప్ సినీ ఫక్కీలో జరిగింది. మాస్ సినిమాని తలపించే రేంజ్ లో… ఓ ఇంటిపై దాడి జరగడం.. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత టీంలుగా రంగం లోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేయడం. అంతా సినిమా లానే జరిగిపోయింది.
తనకు నచ్చిన వైశాలిని తనకు కాకుండా వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఈ దాడి, కిడ్నాప్ కు పాల్పడ్డానని నవీన్ విచారణలో వెల్లడించాడు. వీరిద్దరి లవ్ స్టోరీ… కరోనా సమయంలో వైశాలి షటిల్ ఆడేందుకు వెళ్లి… అక్కడి నుంచి వీరి పరిచయం మొదలై ప్రేమగా మారింది. షికార్లు, ఆపై విహార యాత్రలకు వెళ్లారు. కానీ ఇద్దరి మధ్య ఇంత జరిగినా… ఏమైందా ఏమో కానీ వైశాలి రెడ్డి పేరెంట్స్ వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో వైశాలి రెడ్డి కూడా పెళ్లికి నో చెప్పింది. ఇక ఇప్పుడు మొత్తానికి నవీన్ ఓ ఇంటి వాడు కావడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడిందని భావిస్తున్నారు.
రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నవీన్ రెడ్డి.. ఇన్ స్ట్రాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. వైఫ్ ను చూపిస్తూ తన ప్రాబ్లం ఇదే నంటూ సెటైర్ వేశాడు. అయితే ఎట్టకేలకు నవీన్ ఓ ఇంటి కావడంతో ఆయన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఇక నైనా ఎలాంటి వివాదాలకు పొకుండా బుద్దిగా ఉంటూ అంటూ మరికొందరూ సలహాలు ఇస్తున్నారు.