మహి ఎంట్రీ ఓ సర్ ప్రైజ్.. ధోనీని వద్దనుకున్న చెన్నై ఫ్రాంచైజీ
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే.. ముంబైతో సమానంగా అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచిన జట్టు.. అంతేకాదు మిగిలిన జట్లతో పోలిస్తే మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఆ టీమ్ కే.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం వన్ అండ్ వోన్లీ మహేంద్రసింగ్ ధోనీ
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే.. ముంబైతో సమానంగా అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచిన జట్టు.. అంతేకాదు మిగిలిన జట్లతో పోలిస్తే మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఆ టీమ్ కే.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం వన్ అండ్ వోన్లీ మహేంద్రసింగ్ ధోనీ అనడంలో ఎలాంటి డౌట్ లేదు..ధోనీ లేకుండా సీఎస్కే టీమ్ ను ఊహించడం కష్టమే.. అలాంటి ధోనీని మొదట చెన్నై ఫ్రాంచైజీ తమ టీమ్ లోకి వద్దనుకుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐపీఎల్ అరంగేట్ర వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను కొనుగోలు చేయాలని సీఎస్‌కే భావించిందట. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అయితే అప్పటికే సెహ్వాగ్‌ను.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ సెహ్వాగ్ కు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేసినట్టు తెలిసింది. దీంతో ధోనీని తీసుకునేందుకు చెన్నైకు లైన్ క్లియర్ అయింది. కాగా చెన్నై జట్టు కూర్పులో భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించాడని బద్రీనాథ్ గుర్తు చేశాడు.. సెహ్వాగ్‌పై మేనేజ్‌మెంట్ ఆసక్తికనబర్చినప్పటికీ ధోనీని తీసుకోవాలనే ఆలోచన ఆయనేదనన్నాడు. తర్వాత ధోనీనే చెన్నై టీమ్ ఫేస్ గా మారిపోయి ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు. కాగా 43 ఏళ్ల ధోనీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతాడా లేదా అనేది సందేహంగా మారింది.