MUDRAGADA PADMANABHAM: సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావొద్దా..? ముద్రగడ చెబితే జనం వింటారా..?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి ఈ ఎన్నికల్లో ఒక్కటే టార్గెట్ ఇచ్చినట్టుంది ఆ పార్టీ అధిష్టానం. రోజుకో ప్రెస్ మీట్ పెట్టడం.. పవన్ కల్యాణ్ ని తిట్టడం.. అటో ఇటో కొందరు కాపు నేతలతో మాట్లాడి.. పవన్‌కి ఓట్లు పడకుండా ప్లాన్ చేయడం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 02:36 PMLast Updated on: Apr 15, 2024 | 2:37 PM

Mudragada Padmanabham Criticising Pawan Kalyan In Pitapuram

MUDRAGADA PADMANABHAM: వైసీపీలో జాయిన్ అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి ఈ ఎన్నికల్లో ఒక్కటే టార్గెట్ ఇచ్చినట్టుంది ఆ పార్టీ అధిష్టానం. రోజుకో ప్రెస్ మీట్ పెట్టడం.. పవన్ కల్యాణ్ ని తిట్టడం.. అటో ఇటో కొందరు కాపు నేతలతో మాట్లాడి.. పవన్‌కి ఓట్లు పడకుండా ప్లాన్ చేయడం. అంతకుమించి పెద్దాయన్ని పెద్దగా వాడుకోవాలని వైసీపీ అనుకోవట్లేదని అర్థమవుతోంది. ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి.. దమ్ముంటే నాతో మాట్లాడు.. నన్ను విమర్శించు.. నాపై ప్రెస్ మీట్ పెట్టు.. అంటూ ఊగిపోయారు ముద్రగడ పద్మనాభం.

YS SHARMILA: మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వమే మద్యం అమ్మడమా..?: వైఎస్ షర్మిల

మరో రోజు.. అసలు పవన్ కల్యాణ్‌కి పిఠాపురంతో ఏం పని.. సినిమావాళ్ళని గెలిపిస్తే నియోజకవర్గంలో ఉంటారా.. వాళ్ళు షూటింగ్ చేస్తున్న ఏరియాకి వెళ్ళి.. మన సమస్యలు చెప్పుకోవాలా అంటూ విమర్శించారు. ఇలా జనాన్ని రెచ్చగొడుతూ.. రోజుకో ప్రెస్ మీట్‌తో కాలం గడిపేస్తున్నారు ముద్రగడ. గతంలో దమ్ముంటే పిఠాపురంలో నాతో పోటీ చేయ్ అని పవన్ కల్యాణ్‌కి సవాల్ చేశారు ముద్రగడ పద్మనాభం. కానీ వైసీపీ ఆయన్ని కాకుండా.. వంగా గీతనే అక్కడ తమ అభ్యర్థిగా కంటిన్యూ చేసింది. గీత గెలుపు కోసం ఏనాడూ ప్రచారానికి వెళ్ళలేదు ముద్రగడ. అప్పట్లో తన ఇంటికి పవన్ కల్యాణ్ వచ్చి.. తనకో ఎంపీ టిక్కెట్టు.. తన కొడుక్కి ఓ ఎమ్మెల్యే టిక్కెట్టు ప్రకటించాలని ఆశించారు. అది నెరవేరకపోవడంతో ముద్రగడకు కాలిపోతోంది. పవన్ కల్యాణ్‌ని కాపుల నుంచి వేరు చేయాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ తన ప్రచారంలో ఒకటే చెబుతున్నారు. తాను ఫలానా కాస్ట్ అని ముద్ర వేయించుకోవడం ఇష్టం లేదని.. అందుకే ముద్రగడను కూడా ఆయన దగ్గరకు తీయలేదని చెబుతున్నారు.

దీంతో పవన్ కల్యాణ్ సినిమా నటుడు కాబట్టి ఆయన్ని గెలిపిస్తే ఇక్కడ ఉండడు.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లండన్.. ఇలా ఎక్కడ ఉంటే అక్కడికి మన సమస్యలు చెప్పుకోడానికి వెళ్ళాలా.. అసలు సినిమా యాక్టర్స్‌ని గెలిపించవద్దని కొత్త రాగం అందుకున్నారు ముద్రగడ పద్మనాభం. అసలు సినిమా ళ్ళని రాజకీయాల్లోకి రానీయొద్దు.. వాళ్ళకి ఓట్లెయ్యద్దు అంటున్నారు. అలా అనుకుంటే.. ముద్రగడ ఒకప్పుడు నటుడు ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ పార్టీ టీడీపీలోనే పనిచేశారు కదా. అది మర్చిపోయారా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీలో రోజా, పోసాని, అలీ వీళ్ళంతా సినిమా నటులు కాదా. వాళ్ళని కూడా గెంటేయాలా.. ఏమో అది ముద్రగడకే తెలియాలి. ఇంతకీ ముద్రగడ టార్గెట్ ఏంటంటే.. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలవకూడదు. గెలిస్తే తాను చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. వైసీపీలో నెక్ట్స్ ఫూచర్ ఉండదు అని భయం పట్టుకుందని జనసేన అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ గెలవడం పక్కా అంటున్నారు.