Mukhesh Luddu Reverse : లడ్డూలు వెనక్కి తీసుకుంటున్న ముఖేష్ అంబానీ… వీడియో వైరల్… అసలు సంగతేంటి ?

బిలియనీర్, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కంచాల్లో పెట్టిన లడ్డూలు వెనక్కి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  అదేంటి... మొన్న చిన్నకొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లో జామ్ నగర్ జనానికి లడ్డూలు వడ్డిస్తున్న వీడియో చూశాం కదా ... అనుకుంటున్నారా... కానీ వాటిని వెనక్కి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 05:36 PMLast Updated on: Mar 06, 2024 | 8:48 PM

Mukhesh Luddu Reverse

Mukesh Ambani: బిలియనీర్, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కంచాల్లో పెట్టిన లడ్డూలు వెనక్కి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  అదేంటి… మొన్న చిన్నకొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లో జామ్ నగర్ జనానికి లడ్డూలు వడ్డిస్తున్న వీడియో చూశాం కదా … అనుకుంటున్నారా… కానీ వాటిని వెనక్కి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.

ముఖేష్‌ అంబానీ, నీతా చిన్న కొడుకు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో గ్రాండ్ గా నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానికులకు వేల మందికి అన్న దానం చేశారు. ఆ టైమ్ లో ముఖేష్ తో పాటు నీతా అంబానీ, అనంత్, రాధిక కూడా స్థానికులకు వడ్డించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి.

ఇప్పుడు దానికి రివర్స్ లో..

“ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఆహారం తక్కువైంది.. కొంచెం సర్దుకుపోండి) అనే పేరుతో పోస్ట్‌ అయిన వీడియో చక్కర్లు కొడుతోంది. విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్‌లో షేర్‌ అవుతోంది.

అరే.. బిలియనీర్ అయిన ముఖేష్ అంబానీ అలా ఎందుకు చేస్తారు అని జనం ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది అసలు వీడియోను రివర్స్‌ లో తయారు చేసిన  ఫేక్‌ వీడియో..

జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  దాంతో నెటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు.