MLA Sitakka Vs Minister Harish Rao : మంత్రి హరీష రావుపై.. “అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు” అంటూ ఫైర్ అయిన ములుగు ఎమ్మెల్యే సీతక్క..
ఇక అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు.. కారు కూతలు కూస్తున్నారు మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. నేను మంత్రిని కావద్దా..? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా..? అని హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mulugu MLA Sitakka fired at Minister Harish Rao saying Harish Rao could not find a match
ఆరోగ్య శాఖ మంత్రి పై హరిష్ రావు (Minister Harish Rao) పై ములుగు (Mulugu) ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మంత్రిని అవుతా అని అనడం నాకళ అన్నారు సీతక్క. బడుగు బలహీనవర్గాలు మంత్రులు కావాద్దా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే సీతక్క. ఇంకా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా..? అంటూ ధ్వజమెత్తారు సీతక్క. దొరల తెలంగాణ కావాలని.. ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ పార్టీ కావాలా అని ప్రజల లే తేల్చుకోవాలని అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటికి వస్తే.. మనకు ఇల్లు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వని, పోడు భూములకు పట్టాలు ఇవ్వని ప్రభుత్వం మన కేందుకు అంటూ బీఆర్ఎస్ నాయకులు మీ ఇంటికి వస్తే తరిమికొట్టండి అంటూ బీఆర్ఎస్ పార్టీపై ద్వజమేత్తిన ఎమ్మెల్యే సీతక్క.
Kanhayalal Ashok Gehlots : కన్హయ్యలాల్‌ను చంపింది బీజేపీ వాళ్లే.. అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణ..
ములుగులో నన్ను ఓడించేందుకు.. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్ రావు 100 కోట్లను తన బంట్రోతులకు ఇచ్చి డబ్బు , మధ్యంతో ములుగు ప్రజలను కొనడానికి పంపిచారని ఆరోపించారు. ఎందుకు నా పైన ప్రభుత్వానికి ఇంత కక్ష కట్టారు అని అన్నారు సీతక్క. నేను ప్రజలకు సేవ చేసినందుకా..? ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నందుకా..? కరోనా సమయంలో ప్రజలకు సేవ చేసినందుకా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు నాపైన ఇన్ని కుట్రలతో టార్కెట్ చేస్తున్నారు అని ములుగు ప్రజలు ఆలోచించాలి అని ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వాళ్లు డబ్బులు నమ్ముకున్నారు. నేను మీమ్ముల నమ్ముకున్నా అని తెలిపారు. వాళ్ళు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు.. అదే నేను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్లు అన్నారు. ఇక అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు.. కారు కూతలు కూస్తున్నారు మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. నేను మంత్రిని కావద్దా..? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా..? అని హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆడ బిడ్డను ఆశీర్వదించడండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీతక్క అన్నారు.