Mumbai High Court: వ్యభిచారం నేరం కాదు.. ముంబై హైకోర్ట్ సంచలన తీర్పు..
సెక్స్ వర్క్ విషయంలో ముంబై హై కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. సెక్స్ వర్క్ చేయడం చట్ట ప్రకారం నేరం కాదని తెలిపింది. ఇతరలకు ఇబ్బంది కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేయడం మాత్రం క్రిమినల్ చర్యగా పరిగణించబుతుందని తెలిపింది.
బ్రోతల్ కేసులో అరెస్టైన ఓ మహిళ కేసు విచారణలో భాగంగా ఈ కామెంట్స్ చేసింది. ముంబై హైకోర్ట్ వెంటనే ఆ మహిళను రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఆమె సంరక్షణ కోసం సంవత్సరం పాటు ఇంట్లోనే ఉంచాలనే మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను కూడా కొట్టేసింది. ఇలా నిర్భందించడం ప్రాథమిక హక్కులకు భగం కలిగించినట్టేనని కోర్టు అభిప్రాయపడింది. ముంబై హైకోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.
అయితే గతంలో కూడా సుప్రీం కోర్టలు ఇలాంటి తీర్పునే ఇచ్చింది. సెక్స్ వర్కర్ పనిలో జోక్యం చేసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది. వ్యభిచారం కూడా ఒక వృత్తి అని పేర్కొన్న సుప్రీంకోర్టు.. సెక్స్ వర్కర్ల పనిలో జోక్యం చేసుకోవద్దంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులను కోర్టు ఆదేశించింది. మేజర్లు అయి ఉండి తమ ఇష్టంతో వ్యభిచారం చేసే సెక్స్ వర్కర్లపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్ల సమస్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సెక్స్ వర్కర్లు కూడా చట్ట ప్రకారం గౌరవం, సమాన రక్షణకు అర్హులని కామెంట్ చేసింది.
వ్యభిచార గృహాన్ని నిర్వహించడం చట్టవిరుద్ధమే అయినప్పటికీ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల పోలీసులు వారి ఇంటిపై దాడి చేయాల్సి వస్తే, సెక్స్ వర్కర్లను అరెస్టు చేయవద్దని, వారిని వేధించవద్దని స్పష్టం చేసింది కోర్టు. వారి వారి స్వంత ఇష్టానుసారం వేశ్యగా మారడం చట్టవిరుద్ధం కాదని, వ్యభిచార గృహాన్ని నిర్వహించడం మాత్రమే చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వారిపై మాత్రమే క్రిమినల్ కేసులు బుక్ చేయాలని పోలీసులకు సూచించింది. సంవత్సరం క్రితం సుప్రీం కోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ముంబై హైకోర్ట్ కూడా అలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.