Kwena Maphaka: ముంబైకి మరో షాక్.. ఐపీఎల్ నుంచి ఆ కుర్ర బౌలర్ ఔట్
ప్రస్తుతం అతడి వయసు 18 సంవత్సరాలు. ఆటతో పాటుగా చదువు కూడా ముఖ్యమని భావించిన మపాక ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలినట్లు అయ్యింది. అండర్-19 వరల్డ్ కప్‌లో మపాక సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Kwena Maphaka: ఐపీఎల్ 17 వ సీజన్ ప్రారంభం నుంచే ఆటగాళ్లకు గాయాలు వెంటాడుతున్నాయి. గాయాల కారణంగా కొంత మంది ప్లేయర్లు టోర్నీ మెుత్తానికే దూరం కాగా.. మరికొందరు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయారు. ముంబై ఇండియన్స్ యువ కెరటం, స్పీడ్ బౌలర్ క్వేనా మపాక విచిత్రమైన కారణంతో ఈ ఐపీఎల్ సీజన్ మెుత్తానికే దూరమయ్యాడు.
Prithvi Shaw: లగ్జరీ ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ధర ఎంతో తెలుసా..?
మపాక పదవ తరగతి పరీక్షలు రాయడానికి స్వదేశం వెళ్తున్నాడు. దీంతో ఈ టోర్నీకి దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 18 సంవత్సరాలు. ఆటతో పాటుగా చదువు కూడా ముఖ్యమని భావించిన మపాక ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలినట్లు అయ్యింది. అండర్-19 వరల్డ్ కప్‌లో మపాక సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో తన పదునైన పేస్‌తో బ్యాటర్ల ఆటకట్టించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో ఇతడిని ముంబై ఇండియన్స్ మినీ వేలంలో దక్కించుకుంది.
అయితే అండర్ 19లో చూపించిన ప్రతిభనే ఇక్కడా చూపిస్తాడని భావించిన ఎంఐ యజమాన్యానికి ఊహించని షాక్ తగిలింది. వికెట్లు తీయడం అటుంచి.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 89 రన్స్ ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.