ముంబై సంచలన నిర్ణయం కెప్టెన్ గా ఎవరంటే ?

ఐపీఎల్ రిటెన్షన్ హడావుడి ముగిసింది. కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నా... మరికొన్ని ఊహించినట్టుగానే రిటెన్షన్లు జరిగాయి. అయితే ఈ సారి రిటెన్షన్ కు సంబంధించి అత్యంత ఆసక్తి రేకెత్తించిన టీమ్ ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్సే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2024 | 12:49 PMLast Updated on: Nov 02, 2024 | 12:49 PM

Mumbai Sensational Decision Who Is The Captain

ఐపీఎల్ రిటెన్షన్ హడావుడి ముగిసింది. కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నా… మరికొన్ని ఊహించినట్టుగానే రిటెన్షన్లు జరిగాయి. అయితే ఈ సారి రిటెన్షన్ కు సంబంధించి అత్యంత ఆసక్తి రేకెత్తించిన టీమ్ ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్సే.. ఎందుకంటే గత సీజన్ అట్టర్ ఫ్లాప్ షో తర్వాత అసలు ముంబై ఎవరిని రిటైన్ చేసుకుంటుందన్న ఆసక్తి మొదలైంది. రోహిత్ శర్మ ఆ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం రోహిత్ ను రిటైన్ చేసుకుంది. అదే సమయంలో మరో నలుగురు ప్లేయర్స్ గా హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా, తిలక్ వర్మలను కంటిన్యూ చేసింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను తమ ఫస్ట్ రిటెన్షన్‌గా 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలను 16.35 కోట్లకు అట్టిపెట్టుకుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను నాలుగో ప్లేయర్‌గా 16 కోట్లకు రిటైన్ చేసుకుంది.

యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ తన సాలరీ క్యాప్‌ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ ఎవరో వెల్లడించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యానే సారథ్యం వహిస్తాడని పేర్కొంది. నిజానికి గత సీజన్ లో రోహిత్ ను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించడం పెద్ద దుమారాన్నే రేపింది. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడ్డారు. అటు స్టేడియంలోనూ పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేశారు. దీనికి తగ్గట్టే ముంబై చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే సీజన్ కెప్టెన్ ను మార్చేస్తాన్న వార్తలు వచ్చాయి.

కానీ ముంబై మాత్రం పాండ్యామీదనే నమ్మకం ఉంచుంది. అతనికి పూర్తి మధ్ధతును ప్రకటిస్తూ మరోసారి హార్థిక్ నే సారథిగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ లేదా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపడుతాడని జరిగిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. ఐపీఎల్ రిటెన్షన్ ఉద్దేశించి హార్దిక్ పాండ్యా మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా ఐదుగురి ఆటగాళ్ల కోసం ముంబై ఇండియన్స్ 70 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు పర్స్‌లో ఇంకా రూ. 50 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బుతోనే ముంబై దాదాపు 17 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో ముంబై ఇండియన్స్‌కు ఒక ఆర్‌టీఎమ్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్ ద్వారా ఇషాన్ కిషన్‌ను వేలంలో తిరిగి కొనుగోలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.