Pawan Kalyan : ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు నా తమ్ముడు.. చిరు అదిరిపోయే పోస్ట్
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా.. ఏపీ రిజల్ట్ ఇలా వచ్చింది అంటే దానికి కారణం పవన్ కల్యాణ్ అనేది అందరికీ తెలిసిన నిజం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్‌బ్యాంక్ చీలకూడదు అని.. తన పార్టీ భవిష్యత్తును పనంగా పెట్టి ఏపీ రాజకీయ చిత్రాన్ని మార్చేశాడు పవన్.

My brother knows where to go down and where to go.. Nice post
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా.. ఏపీ రిజల్ట్ ఇలా వచ్చింది అంటే దానికి కారణం పవన్ కల్యాణ్ అనేది అందరికీ తెలిసిన నిజం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్‌బ్యాంక్ చీలకూడదు అని.. తన పార్టీ భవిష్యత్తును పనంగా పెట్టి ఏపీ రాజకీయ చిత్రాన్ని మార్చేశాడు పవన్. కనీవినీ ఎరగని రీతిలో టీడీపీ,బీజేపీ,జనసేన కూటమికి విజయాన్ని అందించాడు. దిమ్మ తిరిగే మెజార్టీతో గెలిచి ఏపీ అసెంబ్లీలో అధ్యక్షా అనబోతున్నాడు.
పవన్ సాధించిన ఈ విజయంపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. తమ్ముడిని చూస్తే గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. “డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే!
ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. చిరంజీవి చేసిన ట్వీట్‌ను పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.