SISTER MISSING : మా చెల్లి మిస్సింగ్ !.. పోలీసులకు కుషిత ఫిర్యాదు

హోటల్ డ్రగ్స్ (Hotel Drug) కేసులో ఇంకో ట్విస్ట్. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి లిషిత కనిపించట్లేదట. ఆమె సోదరి, టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ కుషిత పోలీసులకు కంప్లయింట్ చేసింది. డ్రగ్స్ కేసులో A8 గా ఉన్న లిషిత విచారణకు రావాలని పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు కూడా పంపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 03:01 PMLast Updated on: Feb 29, 2024 | 3:01 PM

My Sister Is Missing Kushita Complains To The Police

హోటల్ డ్రగ్స్ (Hotel Drug) కేసులో ఇంకో ట్విస్ట్. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి లిషిత కనిపించట్లేదట. ఆమె సోదరి, టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ కుషిత పోలీసులకు కంప్లయింట్ చేసింది. డ్రగ్స్ కేసులో A8 గా ఉన్న లిషిత విచారణకు రావాలని పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు కూడా పంపారు. కానీ మా చెల్లి కనిపించట్లేదంటూ కుషిత ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదు మీద కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో శ్వేత, లిషిత, నీల్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఈ కేసులో డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ నేరాన్ని అంగీకరిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు సెల్లార్ నుంచి చాలామంది ప్రముఖులు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అందులో లిషిత కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. వాళ్ళ కోసం గచ్చిబౌలీ పోలీసులు, SOT పోలీసులు స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి వెతుకుతున్నారు. ఈ టైమ్ లో లిషిత కనిపించడం లేదంటూ… ఆమె సోదరి నటి కుషిత పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడం సంచలనంగా మారింది.

లిషిత ఇంటికి పోలీసులు అంటించిన నోటీసులపై రిప్లై ఇవ్వడానికి లాయర్ తో కలసి నటి కుషిత గచ్చిబౌలీ పీఎస్ కు వచ్చింది. లిషి ఇంట్లో లేదనీ… తను వచ్చాక పంపిస్తామని దర్యాప్తు అధికారులకు తెలిపింది. లిషిత మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. డ్రగ్స్ కేసు బయటపడినప్పటి నుంచి లిషిత కనపడటం లేదని ఫిర్యాదులో తెలిపింది కుషిత. గతంలో రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడ్డింగ్ మింక్ పబ్ లో రైడ్ జరిగినప్పుడు అక్కాచెల్లెళ్ళు లిషిత, కుషిత అక్కడే ఉన్నారు. అక్కడికు ఎందుకెళ్లారని మీడియా ప్రశ్నిస్తే… చీజ్ బజ్జీలు తినడానికి వెళ్ళానంటూ కుషిత చెప్పడం హైలైట్ అయింది.

సోషల్ మీడియాలో ఆమె చీజ్ బజ్జీల గురించి చాన్నాళ్ళు ట్రోలింగ్ నడిచింది. ఆ తర్వాత కుషితకు సినీ అవకాశాలు వచ్చాయి…హీరోయిన్ కూడా అయింది. ఆమె హీరోయిన్ గా బిగ్ బాస్ (Bigg Boss) ఫేమ్ అర్జున్ కళ్యాణ్ (Arjun Kalyan) హీరోగా బాబు నెంబర్ 1 బుల్ షీట్ గాయ్ అనే మూవీ తీశారు. ఇప్పుడు లిషిత కనిపించడం లేదని చెప్పడం చూస్తే… అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలసి నాటకాలు ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం ఖచ్చితంగా లిషిత విచారణకు రావల్సిందే అంటున్నారు. ఆమె రాగానే వైద్య పరీక్షలకు పంపాలని భావిస్తున్నారు.