నా కొడుకుని అవమానించారు, అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు
అశ్విన్ రిటైర్మెంట్ పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన అశ్విన్ సిరీస్ మధ్యలో రీటైర్మెంట్ ప్రకటించడం సాధారణ విషయం కాదు. తన రీటైర్మెంట్ కి కారణాలేవైనా తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది
అశ్విన్ రిటైర్మెంట్ పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన అశ్విన్ సిరీస్ మధ్యలో రీటైర్మెంట్ ప్రకటించడం సాధారణ విషయం కాదు. తన రీటైర్మెంట్ కి కారణాలేవైనా తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నా కొడుకుని టీమిండియా మేనేజ్మెంట్ అవమానించడం వల్లనే రీటైర్మెంట్ ప్రకటించాడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు అశ్విన్ తండ్రి రవిచంద్రన్.
మెల్‌బోర్న్ టెస్ట్ చూడటానికి అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అశ్విన్ ఫోన్ చేసి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని చెప్పినట్టు రవిచంద్రన్ పేర్కొన్నాడు. అయితే ఫోన్ కాల్ కట్ చేసిన కొద్దీ క్షణాల్లోనే అతను మీడియా ముందుకు వచ్చి రీటైర్మెంట్ ప్రకటించాడని తెలిపాడు. అయితే కొడుకు రీటైర్మెంట్ సాధారణ పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం కాదని, అశ్విన్ ని తుది జట్టులోకి తీసుకోకపోవడం వల్లనే అవమానానికి గురైనట్టు అశ్విన్ ఫాదర్ తెలిపారు. అశ్విన్ ని మేనేజ్‌మెంట్ సరిగా ట్రీట్ చేయలేదని ఆవేశంగా వ్యక్తం చేశాడు. ఈ అనిశ్చితి కారణంగానే అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడని రవిచంద్రన్ చెప్పాడు. అంతేకాదు డబ్ల్యూటీసీలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని అశ్విన్ తండ్రి చెప్పాడు. వరుసగా రెండు సార్లు టీమ్ ఇండియాను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు కానీ ఫైనల్స్‌లో ఆడలేదు. ఇది అతని పట్ల క్రూరత్వమేనని స్పష్టం చేశాడు. వీటన్నింటిని ఒక ఆటగాడు ఎంతకాలం సహించగలడు? ఈ కారణంగానే రిటైర్మెంట్ ప్రకటించాడని టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డారు.
మరోవైపు అశ్విన్‌ను WTC ఫైనల్‌కు దూరంగా ఉంచినందుకు గవాస్కర్ కూడా టీమిండియాను విమర్శించాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్ తో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 24 గంటల తర్వాత అశ్విన్ చెన్నై చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. అశ్విన్ మూడు ఫార్మాట్లలో 765 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు.