Janasena: జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల అవినీతి.. జనసేన ఆరోపణ..

వైసీపీ ప్రభుత్వంలో సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయటపెడతామని గతంలోనే నాదెండ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అనేక స్కాంల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో విద్యా శాఖలో జగనన్న విద్యా కానుక పేరుతో జరిగిన స్కామ్‌ను ఈ రోజు వెల్లడించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 04:36 PMLast Updated on: Nov 14, 2023 | 4:43 PM

Nadendla Manohar Accused Ysrcp About Jagananna Vidya Kanuka Scam

Janasena: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుక పథకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది జనసేన. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు చేస్తున్న అవినీతి గురించి వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయటపెడతామని గతంలోనే నాదెండ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అనేక స్కాంల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో విద్యా శాఖలో జగనన్న విద్యా కానుక పేరుతో జరిగిన స్కామ్‌ను ఈ రోజు వెల్లడించారు. ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్లు దారి మళ్ళాయి.

  ఇటీవల ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 5 కంపెనీలపై దాడులు చేసింది. ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్‌లో డొంక కదిలింది.   ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి మీదుగా రాయలసీమకు ఇవి చేరాయా..? నిధులు ఎలా దారి మళ్ళాయి అనేదానిపై ఈడీ సమగ్ర విచారణ మొదలుపెట్టింది.   5 కంపెనీలు సిండికేట్‌గా మారాయి అనేది అర్థం అవుతోంది. నాసిరకం బూట్లు, చిరిగిపోతున్న బ్యాగులు ఇస్తున్నారు. కమీషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు లాలూచీపడ్డారు. ఇప్పటి వరకూ జగనన్న విద్యా కానుక పేరుతో రూ.2400 కోట్లు నిధులు వెచ్చించారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరున్నారు? పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారు.   ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులు. అయితే జగనన్న విద్యా కానుకకు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది 42 లక్షలు. ఈ వ్యత్యాసంలో ఉన్న మొత్తం ఎటు పోతుంది..?   ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం పెద్ద మాటలు చెబుతూ క్వాలిటీ వాల్ అని విద్యార్థులను మభ్యపెడుతున్నారు. గోడ మీద చూపించే వాటికీ, విద్యార్థులకు ఇచ్చే బూట్లు, బ్యాగులకు సంబంధం లేదు.   విద్యార్థులకు ఎడమ కాలుకి 3వ నెంబర్ సైజ్, కుడి కాలుకి 5వ నెంబర్ సైజ్ షూస్ ఇస్తున్నారు.   క్లాస్ వార్ అని చెప్పే జగన్ పేద విద్యార్థుల పేరుతో కోట్లు మళ్లిస్తున్నారు. పేద విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారు.