Nagababu : రెండు ఓట్ల వివాదంలో నాగబాబు.. దొంగ ఓట్లంటూ వైసీపీ విమర్శలు..
ఓటు అనేది రాజ్యాంగం మనకి ప్రసాదించిన హక్కు. ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలి. అదే సమయంలో ఒక వ్యక్తికి ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఒకేసారి రెండు ప్రాంతాల్లో ఓటుహక్కు కావాలి, రెండు ప్రాంతాల్లో ఓట్లు వేస్తాం అంటే.. ఆ ఓటును దొంగ ఓటుగా పరిగణిస్తారు.
ఓటు అనేది రాజ్యాంగం మనకి ప్రసాదించిన హక్కు. ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలి. అదే సమయంలో ఒక వ్యక్తికి ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఒకేసారి రెండు ప్రాంతాల్లో ఓటుహక్కు కావాలి, రెండు ప్రాంతాల్లో ఓట్లు వేస్తాం అంటే.. ఆ ఓటును దొంగ ఓటుగా పరిగణిస్తారు. ఇప్పుడు జనసేన నేత నాగబాబు విషయంలో ఇవే మాటల తూటాలు పేలుస్తున్నారు వైసీపీ నేతలు. వృత్తి రిత్యా సినీ రంగంలో స్థిరపడిన కొణిదెల కుటుంబం అంతా ఎప్పుడో హైదరబాద్‌లో సెటిల్ అయ్యారు. వాళ్లందరి ఓట్లు ఇక్కడే ఉన్నాయి. రీసెంట్‌గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లంతా ఓట్లు కూడా వేశారు. నాగబాబు కూడా ఖైరతాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఓటు కోసం ఏపీలో కూడా అప్లై చేసుకోవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ క్రమంలో మంగళగిరిలో నాగబాబు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ ఓటర్ ఐడీ అప్లికేషన్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. తెలంగాణలో ఓటు ఉండగా.. మళ్లీ ఏపీలో ఓటు ఎందుకు అప్లై చేసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం నాగబాబు మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యులంతా మంగళగిరిలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నాగబాబు దొంగ ఓట్లు ఏర్పాటు చేసుకుంటున్నారంటూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. సమాజంలో ఒక సెలబ్రిటీగా, రాజకీయ నాయకుడిగా బాధ్యత గల పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటి ప్రశ్నిస్తున్నారు. వెంటనే నాగబాబు ఈ విషయంలో స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు నాగబాబు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి వాళ్ల విమర్శలను ఆయన ఎలా తిప్పి కొడతారో చూడాలి.