Naga Babu : పవన్‌కు ఓటు వెయ్యొద్దంటూ నాగబాబు అల్లుడు పోస్ట్ ?
ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎంట్రీలు త్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు మీడియా ముందుకు వచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడతారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. రీసెంట్‌గానే ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి తండ్రికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎంట్రీలు త్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు మీడియా ముందుకు వచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడతారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. రీసెంట్‌గానే ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి తండ్రికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ తిట్టించేందుకు తన తండ్రిని వాడుకుంటున్నారంటూ ఓ రేంజ్‌లో వేసుకుంది. అదే ఫ్లోలో వెళ్లి జనసేనలో కూడా జాయిన్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుండగానే మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అల్లుడు గౌతమ్ మీడియా ముందుకు వచ్చాడు. తన మామకు అస్సలు ఓటు వెయ్యొద్దంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు కంటిన్యూ అవుతున్న సమయంలో మెగా ఫ్యామిలీ గురించి ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగబాబు అల్లుడు చైతన్య మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కామెంట్ చేశాడు అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ అంతా నమ్మక ద్రోహులని.. ఆర్టిస్టులను భయపెట్టి ప్రచారం చేయిస్తున్నారంటూ చైతన్య (Chaitanya) చెప్పినట్టుగా ఆ పోస్ట్ ఉంది. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మెగా ఫ్యామిలీని మాత్రం నమ్మొద్దంటూ ఓటర్లను చైతన్య కోరుతున్నారంటూ కొందరు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. వైసీపీకి ఇప్పుడు ఇది ఆయుధంగా మారింది. వైసీపీ కార్యకర్తలు పనిగట్టుకుని మరీ ఆ పోస్ట్‌కు రంగులు దిద్ది మరీ వైరల్ చేస్తున్నారు. అయితే చైతన్య పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ పోస్ట్ ఫేక్ అని తెలుస్తోంది. రీసెంట్‌గా చైతన్య ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. మీడియా ముందుకూ రాలేదు.
తన సోషల్ మీడియాలో కూడా ఎలక్షన్ గురించి గానీ మెగా ఫ్యామిలీ గురించి గానీ పోస్ట్ చేయలేదు. దీంతో కావాలనే కొందరు పవన్ కళ్యాణ్‌పై బురద జల్లేందుకు ఈ పని చేస్తున్నారంటూ జనసేన నేతలు చెప్తున్నారు. నాగబాబు కూతురు నిహారిక చైతన్య 2020లో పెళ్లి చేసుకున్నారు. తరువాత వాళ్ల పర్సనల్ కారణాల వల్ల విడిపోయారు. అప్పటి నుంచి ఎవరి జీవితం వాళ్లు బుతుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు రాజకీయాల్లోకి లాగేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. నిహారిక పెళ్లి విషయం వైరల్ అయ్యింది కాబట్టే.. ఇప్పుడు జనసేనను టార్గెట్ చేస్తూ చైతన్య పేరుతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.