KCR Bus Yatra : నేడు నాగర్ కర్నూల్ కేసీఆర్ బస్సు యాత్ర.. రోడ్ షో
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ (BRS) పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఊపందుకోంటుంది.

Nagar Kurnool KCR bus trip today.. road show
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ (BRS) పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఊపందుకోంటుంది. భారీ బహిరంగ సభలు, బస్సు యాత్రలు, రోడ్ షోలు ఇలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయాత్రలు చేస్తుంది.
కాగా నేడు ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్ కర్నూల్ (Nagar Kurnool) లో బస్సు యాత్ర నిర్వహించి అక్కడే జరిగే రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో… ఆ వేడుకలను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) లు తమ గెలుపునకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు నాగర్ కర్నూల్ లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో కొనసాగనుంది. అక్కడ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారు. దీంతో జిల్లాలో కేసీఆర్ రెండు రోజుల బస్సు యాత్ర ముగుస్తుంది.
SSM