Big Boss: ఫైర్ మోడ్ లో నాగార్జున.. షాకైన ఇంటిసభ్యులు

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతున్న నాగార్జున. దీనిపై ప్రోమో కట్ చేసి విడుదల చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 30, 2023 | 06:31 PMLast Updated on: Sep 30, 2023 | 6:31 PM

Nagarjuna Fired At The Housemates In Bigg Boss The Promo Is Shocking

బిగ్ బాస్ నాలుగోవారం వీకెండ్ కు వచ్చేసింది. నాగార్జున కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఇంటిసభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హుషారుగా వస్తాడేమో అనుకున్న నాగ్.. బెల్ట్ పట్టుకుని ఎంట్రీ ఇవ్వగానే హడలిపోయారు ఇంటిసభ్యులు.. వీకెండ్ ప్రోమో అదిరిపోవడంతో పాటు ఎపిసోడ్ పై క్యూరియాసిటిని పెంచింది.

ప్రోమో విషయాని వస్తే.. చేత బెల్ట్ పట్టుకునిఆవేశంగా వచ్చేశాడు నాగార్జున. వస్తూ వస్తూ నే ఇంటిసభ్యులపై ఫైరయ్యాడు. మరి ముఖ్యంగా శివాజీ, సందీప్ లపై ఓ రేంజ్ లో విరుచుపడ్డాడు. సంచాలక్ సందీప్‌లే.. నీకు కళ్లు కనిపిస్తున్నాయా లేక గుడ్డోడివా అంటూ నిలదీశాడు. ఆ తరువాత శివాజీకి క్లాస్ పీకాడు. బెల్ట్ గౌతమ్ మెడకి వేసి లాగుతుంటే.. మాట్లాడలేదు. అదే గౌతమ్.. తేజా మెడకి బెల్డ్ వేసి లాగుతుంటే మాత్రం వద్దని చెప్పావ్.. ఏ ఎందుకు? అంటూ వీడియో వేసి మరీ.. వాయించేశాడు.

తేజా గౌతమ్‌ మెడకి బెల్ట్ వేసి లాగిన వీడియోను చూపించాడు నాగార్జున. కావాలని చేయలేదని శివాజీ చెబితే.. సారీ అంటూ సందీప్ చెప్పడంతో నాగ్ కు మరింత కోపం వచ్చింది.సంచాలక్‌గా మీరు ఫెయిల్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక టేస్టీ తేజాకు చుక్కలు చూపించాడు. అమ్మాయిలు అరుస్తున్న ఎందుకు ఆగలేదని అడిగేశాడు. ఎంకరేజ్ మెంట్ అనుకున్న అనగానే కోపం మరింతపెరిగింది. దీంతో తేజా ఏ శిక్ష వేసిన రెడీ సార్ అన్నాడు. దీంతో నాగ్ శుభ్రనీ అడగ్గా.. జైలు సార్ అని చెప్పింది. ప్రియాంక ఇది చాలా చిన్నది అనగా.. సందీప్.. బయటకు పంపించాలంటూ చెప్పగా.. ఇంటిసభ్యులు షాక్ అయ్యారు. మొత్తానికి ప్రోమో అదిరిపోవడంతో పాటు ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.