నాగార్జునకు ఊహించని షాక్ ఇచ్చిన రేవంత్
మాదాపూర్లో హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ను కూల్చిన హైడ్రా

తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా అక్రమార్కులకు చుక్కలు చూపిస్తోంది. తన మన అనే భేదం లేకుండా అక్రమార్కుల భరతం పడుతోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు షాక్ ఇచ్చింది హైడ్రా. మూడు రోజుల నుంచి ఆయనకు చెందిన ఎన్-కన్వెన్ష న్ కూలుస్తారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎట్టకేలకు హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చి వేస్తుంది.
మాదాపూర్లో హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ను ఉదయం నుంచి కూల్చడం మొదలుపెట్టారు అధికారులు. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం ఈ పనులు చేస్తున్నారు హైడ్రా అధికారులు. మూడున్నర ఎకరాల చెరువును ఆక్రమించి ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు కూల్చివేతకు దిగారు. దాదాపు మూడున్నర ఎకరాల చెరువుని కబ్జా చేసి కట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.