Nagarjuna yadav : నాగార్జునను లోపలేశారు.. కుప్పంలో కౌంట్ డౌన్ స్టార్ట్
వైసీపీ హయాంలో కన్నూ మిన్నూ కానకుండా... చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ నే కాదు... ప్రతిపక్ష మహిళా నేతల్నీ బూతులు తిట్టిన వాళ్ళందరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

Nagarjuna was brought in.. Countdown started in the heap
వైసీపీ హయాంలో కన్నూ మిన్నూ కానకుండా… చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ నే కాదు… ప్రతిపక్ష మహిళా నేతల్నీ బూతులు తిట్టిన వాళ్ళందరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పట్లో బాధితులు పెట్టిన కేసుల ఫైళ్ళను ఇప్పుడు పోలీసులు దుమ్ము దులుపుతున్నారు. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితను కూడా వ్యక్తిగతంగా తిట్టిన… యనమల నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ హయాంలో బాబు, పవన్, లోకేశ్ తో పాటు…. మహిళా ప్రతిపక్ష నేతలను ఎంత తిడితే అంత టాప్ పొజిషన్ కు వెళ్ళేవారు. ఎమ్మెల్యేలకు మంత్రులుగా ప్రమోషన్లు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో నోటికొచ్చిన బూతులు మాట్లాడేవాళ్ళంతా… వైసీపీకి అధికార ప్రతినిధులుగా, పేటీఎం బ్యాచ్… అంటే ఇన్ ఫ్లుయెన్సర్లుగా మారిపోయారు. ఇలాంటి దర్జాను అనుభవించిన వాళ్ళల్లో నాగార్జున యాదవ్ పేరు కూడా ఉంది. ఆయన అప్పట్లో స్థాయికి మించి కామెంట్లు చేసేవారు. వయస్సు చిన్నదే అయినా… చంద్రబాబును కూడా ఏక వచనంతో బూతు ప్రయోగాలు చేశారు. పవన్ మూడు పెళ్ళిళ్ళు అంటూ చెలరేగిపోయాడు. ఇక వైసీపీ అధికార టీవీకి ఆస్థాన వక్త కూడా. అంతెందుకు మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా జొమాటో ఎంప్లాయ్ తో పోల్చాడు నాగార్జున యాదవ్. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా… నాగార్జున యాదవ్ నోటి దూల తగ్గలేదని టీడీపీ నేతలు కామెంట్ చేస్తుంటారు.
నాగార్జున యాదవ్… హోంమంత్రి వంగలపూడి అనితను కూడా టార్గెట్ చేశారు. ఆమె వ్యక్తిగత జీవితంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఆ యనమల నాగార్జున యాదవ్ … బెంగళూరు నుంచి విజయవాడకు వస్తుండగా… గన్నవరంలో పట్టుకున్నారు పోలీసులు. కుప్పంలో ఆల్రెడీ ఓ కేసు ఉంది. దాంతో పాటు విజయవాడలోనూ బలమైన కేసులు పెట్టాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం నాగార్జున యాదవ్ కుప్పం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.