హైడ్రాకు నాగార్జున వార్నింగ్, మీ సంగతి అక్కడే తేలుస్తా…

ఈ రోజు ఉదయం హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ తో అధికారులు వెళ్లి కూల్చడంతో కోర్ట్ కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది యాజమాన్యానికి. ఇదిలా ఉంచితే ఈ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2024 | 01:12 PMLast Updated on: Aug 24, 2024 | 1:20 PM

Nagarjunas Warning To Hydra Your Matter Will Be Resolved There

ఈ రోజు ఉదయం హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ తో అధికారులు వెళ్లి కూల్చడంతో కోర్ట్ కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది యాజమాన్యానికి. ఇదిలా ఉంచితే ఈ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. “స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పేందుకు ఈ ప్రకటనను విడుదల చేయడం సరైనదని నేను భావిస్తున్నా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసారు.

ఆ భూమి పట్టా భూమి అన్నారు. ఒక్క అంగుళం కూడా చెరువులో ఆక్రమణకు గురికాలేదు అన్నారు నాగార్జున. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని తన ప్రకటనలో పేర్కొన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా ఇచ్చారని నాగార్జున పేర్కొన్నారు. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది అంటూ ఆయన ఆరోపించారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అన్నారు నాగార్జున. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేసారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఆయన పోస్ట్ చేసారు.