Nandamuri Balakrishna: సైకిల్ రావాలంటూ.. బాలయ్య బస్సుయాత్ర..
టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు.ఈ నెల 12 నుంచి బస్సు యాత్రను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. సైకిల్ రావాలి పేరుతో రాష్ట్రమంతటా బస్సు యాత్రను నిర్వహించనున్నారు. 12న కదిరిలో ఈ యాత్ర మొదలుకానుంది.

Nandamuri Balakrishna: టీడీపీ.. ప్రచార స్పీడ్ పెంచేందుకు రెడీ అవుతోంది. లోకేష్ ప్రస్తుతానికి మంగళగిరికే పరిమితం కాగా.. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఐతే బావ కోసం, పార్టీ కోసం.. బాలయ్య రంగంలోకి దిగబోతున్నారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు.
PITHAPURAM YCP: పిఠాపురం వైసీపీలో వర్గపోరు.. పవన్‌కు ప్లస్ అవుతుందా..?
ఈ నెల 12 నుంచి బస్సు యాత్రను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. సైకిల్ రావాలి పేరుతో రాష్ట్రమంతటా బస్సు యాత్రను నిర్వహించనున్నారు. 12న కదిరిలో ఈ యాత్ర మొదలుకానుంది. ఆ తర్వాత రాయలసీమలోని ప్రధాన నియోజకవర్గాలను కవర్ చేసేలా బాలయ్య బస్సు యాత్రను షెడ్యూల్ చేశారు. నిజానికి ఇప్పటి వరకు బాలకృష్ణ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేదు. ఐతే బాలయ్య అభిమానుల కోసం ఆయన ఎక్కువగా రాయలసీమ జిల్లాలోనే పర్యటించబోతున్నారు. సీమలో బాలకృష్ణకు అభిమానులు ఎక్కువ. దీంతో అక్కడ పార్టీలో జోష్ నింపేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముందుగా రాయలసీమ జిల్లాల్లో మొదలుపెట్టి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు బాలయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బాలయ్య ఎంట్రీతో టీడీపీకి భారీ ప్లస్ కాబోతోంది. ప్రస్తుతానికి చంద్రబాబు మాత్రమే అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. బాలయ్య యాడ్ అయితే.. ప్రచారం స్పీడ్ పెరిగే చాన్స్ ఉంది. ఇక అటు నందమూరి, నారా కుటుంబాల నుంచి మరికొంతమంది కూడా స్టార్ క్యాంపెయినర్లు టీడీపీ తరఫున ప్రచారానికి రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.