NANDAMURI BALAKRISHNA: ఇదీ అసలు సంగతి! బాలయ్య తిట్టింది ఎన్టీఆర్‌ను కాదట..
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయండి అంటూ బాలయ్య ఆదేశించడం.. అనుచరులు దాన్ని ఫాలో కావడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ అంటే ఎంత కోపం ఉన్నా ఇలా చేయడం కరెక్ట్ కాదు బాలయ్య అంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు తారక్ ఫ్యాన్స్.
NANDAMURI BALAKRISHNA: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడినట్లు అయ్యాయ్. బాలయ్య వర్సెస్ తారక్ మధ్య రచ్చ ఏ స్థాయిలో ఉందో ఒక్క సంఘటన చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయండి అంటూ బాలయ్య ఆదేశించడం.. అనుచరులు దాన్ని ఫాలో కావడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ అంటే ఎంత కోపం ఉన్నా ఇలా చేయడం కరెక్ట్ కాదు బాలయ్య అంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు తారక్ ఫ్యాన్స్.
Raviteja: మంచే జరిగింది.. రవితేజ భలే తప్పించుకున్నాడు..
జూనియర్ మీద కోపంతోనే బాలయ్య ఇలా రియాక్ట్ అయ్యారని.. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకొని రగిలిపోతున్నారని.. బాబాయ్, అబ్బాయ్‌కు మధ్య పెరిగిన దూరం పూడ్చడం ఇప్పట్లో ఎవరి వల్లా అయ్యే పని కాదంటూ.. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయ్. మనసులో కోపం ఉన్నా.. బాలయ్య ఇలా ఓపెన్‌గా ఫ్లెక్సీలు పీకేయండి అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే.. అసలు అంత ఓపెన్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐతే బాలయ్య కోపానికి కారణం వేరే ఉందన్నది ఇంకొందరి నుంచి వినిపిస్తున్న మాట. కోపం తారక్ మీద కాదట.. ఎన్టీఆర్ వర్ధంతి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మీదనట. బాలయ్యకు మాములుగానే ముక్కు మీద కోపం. ఆ ఫ్లెక్సీలు, ఆ రాతలు చూసి చిర్రెత్తుక్కొచ్చిందట. అందుకే అలా రియాక్ట్ అయ్యారట అంటూ.. టీడీపీ వర్గాలు డ్యామేజీని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయ్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపించారని తెలుస్తోంది.
నందమూరి తారకరామారావు 28వ వర్ధంతికి విచ్చేయనున్న జూనియర్ ఎన్టీఆర్‌కు స్వాగతం.. సుస్వాగతం అని ఫ్లెక్సీలు వేశారు. వర్ధంతికి స్వాగతం అని ఎలా వేశారో, ఎందుకు వేశారో.. ఆ ఫ్లెక్సీ డిజైన్ చేసిన అభిమానులకే తెలియాలి అన్నది టీడీపీ వర్గాలు చెప్తున్న మాట. ఈ ఫ్లెక్సీ చూడగానే ఎవరికైనా కోపం వస్తుందని.. ఇదే బాలయ్య విషయంలో కూడా జరిగిందని అంటున్నారు. ఐతే ఈ విషయం బయటకు రాలేదని.. ఎన్టీఆర్, బాలయ్య మధ్య విభేదాలు బయటకు ప్రొజెక్ట్ అయ్యాయని.. జరిగింది ఒకటి.. బయటకు కనిపిస్తోంది ఇంకొకటి అంటూ కొత్త చర్చ జరుగుతోంది. ఏమైనా ఒక్క సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్‌కు కారణం అయింది. బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చిన్నపాటి యుద్ధమే చేస్తున్న పరిస్థితి.