Nara Lokesh: ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. అమిత్ షాతో లోకేష్ భేటీ
గత 20 రోజులుగా ఢిల్లీ పెద్దలను కలవాలని మకాం వేసిన లోకేష్ కి తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించింది. దీంతో బుధవారం రాత్రి నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రికి తమపై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు గురించి లోకేష్ వివరించారు. ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.

Nara Lokesh met Union Home Minister Amit Shah on Wednesday night
తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ Nara Lokesh కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amith Sha ను కలిశారు. బుధవారం సాయంత్రం సీఐడీ విచారణ ముగించుకుని నేరుగా ఢిల్లీ వెళ్ళారు. ఈయన వెంట బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి Kishan Reddy, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరీ Purandheshwari ఉన్నారు. అమిత్ షా ని కలిసిన లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి Jagan Mohan Reddy తమపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. చంద్రబాబును 73ఏళ్ల వయసులో అరెస్ట్ చేయడంతో పాటూ తమను తమ కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధిస్తున్నారని వివరించారు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నట్లు చెప్పారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు, చంద్రబాబును కక్షపూరితంగానే అరెస్ట్ చేశారనే విషయాన్ని అమిత్ షా కు తెలిపినట్లు ట్విట్టర్ Twitter వేదికగా తెలిపారు. దీంతో పాటూ రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు Chandrababu ప్రాణహాని ఉన్నట్లు కేంద్ర హోం మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు.
అమిత్ షా స్పందన..
లోకేష్ తో మాట్లాడిన అమిత్ షా చంద్రబాబు పై పెట్టిన కేసులపై ఆరా తీశారు. ఎన్ని కేసులు పెట్టారు, ప్రస్తుతం ఏసీబీ మొదలు హైకోర్ట్, సుప్రీం కోర్టులో ఉన్న కేసుల విచారణ, వాటి స్థితి గతులను గురించి అడిగి తెలుసుకున్నారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇలా జైళ్లలో పెట్టడం సరైన పద్దతి కాదని అమిత్ షా అభిప్రాయపడ్డట్లు సమాచారం. అలాగే బాబు ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ కేంద్రం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉందని లోకేష్ తో అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.
పురంధేశ్వరి ట్వీట్..
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని కొందరు గతంలో ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా పురంధేశ్వరి స్పందించారు. నిజంగానే చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంటే లోకేష్ కి అమిత్ షా అపాయింట్మెంట్ ఎలా దొరికిందని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితులే ఉంటే అమిత్ షా తో లోకేష్ తన కేసుల గురించి ఎందుకు అడిగి తెలుసుకుంటారని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలా అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళు వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం పనితీరుతో పాటూ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తుత ఏపీ రాజకీయాల పరిణామాలను పూర్తిగా అమిత్ షా కి లోకేష్ వివరించినట్లు పేర్కొన్నారు.
T.V.SRIKAR