Nara Lokesh: ఓపెన్ కోర్టులో చంద్రబాబు.. రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్ పేరు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీవ్ర ఉత్కంఠ
సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలను వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్ పేరు ఎందుకున్నట్లు.
ఏపీ స్కిల్ డివలప్మెంట్ కేసులో అనేక మలుపులు తిరుగుతున్నాయి. నిన్న చంద్రబాబుని అరెస్ట్ చేసిన పోలీసులు ఓపెన్ కోర్ట్ లో జడ్జి ముందు హాజరుపరిచారు. తము దర్యాప్తు చేసిన రిమాండ్ రిపోర్ట్ ను న్యామమూర్తి బెంచ్ పై ప్రవేశపెట్టారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేని కారణంగా అందులో ఇతని పేరును చేర్చేందుకు మెమోను దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన ప్రత్యేక కోర్టు వాదనలు వినేందుకు సిద్దమైంది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడు నారా లోకేష్ పేరును రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్ కి డబ్బులు ముట్టినట్లు నివేదికలో పేర్కొంది. ఈవిషయాలు తమ ఇన్వెస్టిగేషన్లో తేలినట్టు తెలిపింది ఏపీ సీఐడీ. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలంటే బాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేయడం రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్ పేరు నమోదు చేయడంతో దీనిపై కోర్ట్ ఏవిధంగా స్పందిస్తుందో అని అందరిలో ఆసక్తి మరింత పెరిగింది. అయితే వీటిపై ఏసీబీ ప్రత్యేక కోర్ట్ ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో వేచి చూడాలి.