NARA LOKESH: జగన్ ఒక భస్మాసురుడు.. అరెస్టులకు భయపడం: నారా లోకేష్

జగన్ పేదలకు - పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. జరగబోయేది పేదలకు, దోపిడీదారులకు మధ్య యుద్ధం. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా..? జగన్ పేదవాడు కాదు దోపిడీదారుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2023 | 01:43 PMLast Updated on: Nov 29, 2023 | 1:43 PM

Nara Lokesh Sensational Comments On Ys Jagan

NARA LOKESH: జగన్ ఒక సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ అని, సింపుల్‌గా చెప్పాలి అంటే భస్మాసురుడని విమర్శించారు నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా ముమ్మిడివరం బహిరంగ సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “లోక్‌సభ స్పీకర్‌‌గా ఎదిగిన బాలయోగి రాజకీయం ప్రస్థానం మొదలైంది ముమ్మిడివరం నియోజకవర్గం నుంచే. ఎంతో ఘన చరిత్ర ఉన్న ముమ్మిడివరం నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. జగన్ ఒక సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్. సింపుల్‌గా చెప్పాలి అంటే భస్మాసురుడు.

H1B VISAS: యూఎస్ 20 వేల వీసాల జాతర.. భారతీయులకు ఇక పండగే

జగన్ వేసిన సెల్ఫ్ గోల్ ఏంటో తెలుసా? చంద్రబాబు అరెస్ట్. జగన్ అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఇంకొకటి. చంద్రబాబుకుకి అవినీతి మరక అంటించాలని అక్రమంగా అరెస్ట్ చేసాడు. కానీ చంద్రబాబు గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఇప్పటి యువతకి ఆయన విజన్ ఏంటో అర్ధమైంది. మరో మూడు నెలల్లో రాబోయేది టిడిపి, జనసేన ప్రభుత్వం. బాంబులకే భయపడని కుటుంబం మనది. జగన్ పెట్టే కేసులకు, అరెస్టులకు భయపడతామా..? యువగళాన్ని ఆపడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేసాడు. రాజారెడ్డి రాజ్యాంగం ఇచ్చి పోలీసుల్ని పంపాడు. నేను అంబేద్కర్ రాజ్యాంగం చూపించి సమాధానం చెప్పాను. జగన్ పనైపోయింది. మరో మూడు నెలల్లో వైసిపి ప్యాకప్. ఈ మాట నేను అనడం లేదు. జగన్ దగ్గర పనిచేసిన అధికారులే అంటున్నారు. కొంతమంది అధికారులు ఢిల్లీకి డెప్యుటేషన్ పెట్టుకున్నారు అంట. వాళ్లు ఢిల్లీకి వెళ్తున్నారు అంటే అర్ధం ఏంటి? జగన్ జైలుకి వెళ్ళిపోతున్నాడు.

డెప్యుటేషన్ పెట్టుకున్న వారిలో కొంతమంది జగన్ చెప్పిన మాట విని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు కూడా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళిపోయినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించడం తప్పదు. కరోనా టైంలో టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి అవమానించాడు. రకరకాల యాప్స్ పెట్టి వేధించాడు. ఆ తరువాత ఎన్నికల విధుల నుంచి తొలగించాడు. ఎన్నికల సంఘం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో వినియోగించాలని చెప్పింది. టీచర్లు లేకుండా చేసి ఎన్నికల్లో అక్రమాలు చెయ్యాలని జగన్ వేసుకున్న ప్లాన్ తుస్సుమంది. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే టీచర్ల సమస్యలు అన్ని పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ఏ ఆసుపత్రి కైనా వెళ్లండి. డేటా తీసుకోండి. గత నాలుగున్నర ఏళ్లలో జే బ్రాండ్ లిక్కర్ తాగి చనిపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు.

Koushik Reddy : కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ పై ఈసీ విచారణ:

జగన్ క్లాస్ వార్ జరుగుతుంది అంటున్నాడు. కానీ జరగబోయేది సైలెంట్ వార్. నిశబ్ద విప్లవం. జగన్ పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. జరగబోయేది పేదలకు, దోపిడీదారులకు మధ్య యుద్ధం. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా..? జగన్ పేదవాడు కాదు దోపిడీదారుడు. సైకో పాలన పోతుంది.. సైకిల్ పాలన వస్తుంది” అని నారా లోకేష్ వ్యాఖ్యానించాడు.