NARA LOKESH: సైకో పాలన పోయి.. సైకిల్ పాలన వస్తుంది.. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
సైకో పాలన పోతుంది. సైకిల్ పాలన వస్తుంది. సంక్షోభాలు, పోరాటాలు టిడిపికి కొత్త కాదు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ అనేక సంక్షోభాలు ఎదుర్కున్నారు. కష్టాలకు ఎదురునిలబడి పోరాడే దమ్ము మనకి ఉంది. భయం మన బయోడేటాలో లేదు. యుద్ధం మొదలైంది.
NARA LOKESH: త్వరలోనే ఏపీలో సైకో పాలన పోయి, సైకిల్ పాలన వస్తుందని వ్యాఖ్యానించారు టీడీపీ నేత నారా లోకేశ్. సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం, తాటిపాక బహిరంగ సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా జనంతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. “మూడు నెలలు ఓపిక పట్టండి. టిడిపి కార్యకర్తల్ని వేధించిన వైసిపి వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. రాజోలులో ఉన్నా.. రష్యా పారిపోయినా తీసుకొచ్చి లోపలేస్తా. సైకో పాలన పోతుంది. సైకిల్ పాలన వస్తుంది. సంక్షోభాలు, పోరాటాలు టిడిపికి కొత్త కాదు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ అనేక సంక్షోభాలు ఎదుర్కున్నారు. కష్టాలకు ఎదురునిలబడి పోరాడే దమ్ము మనకి ఉంది. భయం మన బయోడేటాలో లేదు.
యుద్ధం మొదలైంది. సైకో జగన్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఫిక్స్ అయ్యింది. యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు మీరు నన్ను క్షమించాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జనవరి 27 న నేను యువగళం పాదయాత్ర ప్రారంభించాను. ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హామీలు ఇచ్చాను. వైసిపి నాయకుల అవినీతిని బయటపెట్టాను. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ చేస్తున్న దోపిడీ భయటపెట్టాను. సొంత అమ్మని చూసినా, సొంత చెల్లిని చూసినా జగన్‌కి భయమే. 53 రోజులు చంద్రబాబును జైల్లో బంధించారు. న్యాయానికి సంకెళ్లు వేసారు. ఒక్క ఆధారం అయినా చూపించారా? ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు రుజువు చెయ్యగలిగారా? వ్యవస్థల్ని మ్యానేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టి సైకో జగన్ ఆనందం పొందాడు. తూర్పుగోదావరి జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఈ పచ్చదనం, గోదావరి చూసి ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చూపించే మమకారం, వెటకారం రెండూ సూపర్.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి రాజోలు. నియోజకవర్గంలో డ్రైనేజి వ్యవస్థను ఆధునీకరించి రైతుల కష్టాలను తొలగిస్తాం. నియోజకవర్గంలో 3 మండలాలకు సంబంధించిన రైతులకు ప్రధాన సమస్యగా ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రెయిన్14 కి.మీ.ల మేర డ్రెడ్జింగ్ పనులు నిర్వహించాల్సి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులు చేపట్టి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.