Yuvagalam padayatra : నేడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం..

టీడీపీ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. చంద్రబాబు స్కిల్ డెవలప్ అరెస్ట్ కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించి తిరిగి నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రోజులు నియోజకవర్గం పొదలాడ నుంచే ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ యువగళ యాత్రంలో లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 11:05 AMLast Updated on: Nov 27, 2023 | 11:05 AM

Nara Lokesh Yuvagalam Padayatra Will Resume Today

టీడీపీ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. చంద్రబాబు స్కిల్ డెవలప్ అరెస్ట్ కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించి తిరిగి నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రోజులు నియోజకవర్గం పొదలాడ నుంచే ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ యువగళ యాత్రంలో లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు.

ఇక ఇవాళ లోకేష్ యువగళం పాదయాత్ర 210వ రోజును పొదలాడలో కొనసాగించి రాత్రికి అమలాపురం నియోజకవర్గంలో బస చేయనున్నారు. గతంలో పాదయాత్రలో లోకేష్ 28524 కి.మీ నడిచారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా ఆయన పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో తిరిగి పాదయాత్రను మొదలుపెడుతున్నారు నారా లోకేష్. మొదటి రోజు మధ్యాహ్నం 12 : 35కి పి.గన్నవరం నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకుంటారు. నగరంలో గెయిల్ ONGC బాధితులతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం 2గంటలకు మామిడికుదురులో స్థానికులతో సమావేశమవుతారు. అటుపై 2:45కి పాశర్లపూడిలో భోజన విరామం తీసుకుంటారు.

  • 10.19 గంటలకు రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది.
  • 11.20 గంటలకు తాటిపాక సెంటర్‌లోని బహిరంగసభలో లోకేష్ ప్రసంగం
  • 12.35 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో నారా లోకేష్ ముఖాముఖి
  • మధ్యాహ్నం 2 గంటలకు మామిడికుదురులో స్థానికులతో సమావేశం
  • 2.45 గంటలకు పాశర్లపూడిలో భోజన కోసం విరామం
  • సాయంత్రం 4 గంటలకు పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు
  • 4.30 గంటలకు అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో భేటీ
  • 5.30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ
  • 6.30 గంటలకు బోడసకుర్రులో మత్స్యకారులతో లోకేష్ ముఖాముఖి
  • 7.30 గంటలకు పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటి
  • 7.45 గంటలకు పేరూరు శివారు విడిది కేంద్రంలో బస

లోకేష్ తాత్కలిక విరమం తర్వాత నేడు యువగళం పాదయాత్ర పున:ప్రారంభం అయ్యింది. దీంతో నారా లోకేష్ కు పాదయాత్రలో టీడీపీ శ్రేణులు నూతన ఉత్సవాంతో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ బీజేపీలో పొత్తు కుదుర్చుకోని తెలంగాణ ఎన్నికల్లో పొటి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్.. తెలంగాణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ సైతం వారాహియాత్రను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.