వైసీపీ కి రాజీనామ చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

Narasapuram MP Raghuramakrishna Raju resigned from YCP
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు పంపించారు. పార్లమెంట్ సభ్యత్వం నుంచి అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. అందువల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. వేంటనే ఆమోదించాలని కోరారు.
2019లో వైసీపీ (YCP) నుంచి పోటీచేసి గెలిచిన ఈయన.. ఆ తర్వాత కొద్దికాలానికే పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినాయకత్వంపైనే యుద్ధం ప్రకటించి, విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే టీడీపీ-జనసేన (TDP-Jana Sena) కూటమి తరఫున నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ పార్టీ నుంచి అనే విషయం త్వరలో చెబుతానని వెల్లడించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు