Mokshagna coming soon : మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు..
నటసింహ నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీతోపాటు నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

Natasimha Nandamuri Balakrishna actor successor Nandamuri Mokshajna Tollywood entry along with industry and Nandamuri fans
నటసింహ నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీతోపాటు నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా రాబోతున్నాడు అని అభిమానులు అని ఆశలు పెట్టుకోవడం, చివరికి అది జరగకపోవడంతో నిరాశ చెందడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది. ఈ విషయం గురించి బాలయ్యను ఎప్పుడు అడిగినా తప్పకుండా వస్తాడు అని చెప్పడమే తప్ప దాని గురించి క్లారిటీ లేదు. నందమూరి కుటుంబం అంటేనే మాస్.. మరి వారసుడు వచ్చినపుడు దానికి తగ్గ కథ కూడా దొరకాలి కదా.. అందుకే ఈ వెయిటింగ్ అంటున్నారు
మూడు నాలుగేళ్లుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూనియర్ బాలయ్య వస్తాడా.. రికార్డుల మోత మోగిస్తాడా అని వేచి చూస్తున్నారు వాళ్లు. ఇదిలా ఉంటే.. తాజాగా తన ట్విట్టర్‌లో కొత్త లుక్‌తో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశాడు మోక్షజ్ఞ. ‘వస్తున్నా..’ అని క్యాప్షన్ పెట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన తర్వాత నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తమ అభిమాన హీరో తనయుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటే అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మోక్షజ్ఞ లుక్ చూసి అవాక్కవుతున్నారు . ప్రస్తుతం మోక్షజ్ఞ స్లిమ్ లుక్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. ‘ఆదిత్య 369’ మూవీకి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ తెరకెక్కిస్తానని బాలయ్య ఇదివరకే ప్రకటించారు.మోక్షజ్ఞ నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నదే తేల్చుకోలేకపోతోందట నందమూరి కుటుంబం..త్వరలో సెట్స్‌పైకి వచ్చే మోక్షజ్ఞ సినిమా కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని టాక్. తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకి కావాలంటే తనకు కావాలని బాలయ్య ఇద్దరు బిడ్డలు బ్రాహ్మణి, తేజశ్వని పోటీపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.