Nayanthara on Casting Couch: కాస్టింగ్ కౌచ్‌పై నయన్ సంచలన కామెంట్స్..!
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సాధారణంగా మారింది. చాలామంది ఆర్టిస్టులు.. క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని పడిన ఇబ్బందులను సోషల్ మీడియాలో చెప్పుకున్నారు. హీరోయిన్లే కాదు.. హీరోలు కూడా ఉన్నారు ఈ లిస్టులో ! ఐతే ఇప్పటివరకు చాలామంది చిన్న హీరోయిన్లు ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. స్టార్ హీరోయిన్స్ ఎప్పుడూ కనీసం పెదవి విప్పలేదు. చాలా ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చామని చెప్పారే తప్ప… ఎప్పుడూ ఇలాంటి వివాదంపై నోరెత్తలేదు. ఐతే ఫర్ ది ఫస్ట్ టైమ్.. స్టార్ హీరోయిన్ నయనతార తన కాస్టింగ్ కౌచ్ అనుభవాలపై మనసు విప్పారు.
ఈ మధ్యే డైరెక్టర్ విగ్నేష్ పెళ్లి చేసుకున్న నయన్.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. తల్లి అయినా.. సినిమా ఆఫర్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. కింగ్ ఖాన్ షారూఖ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది ఇప్పుడు ! కెరీర్ ప్రారంభంలో పెద్ద స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని… ఐతే ఈ ఆఫర్ కావాలంటే తాము చెప్పినట్లు నడుచుకోవాలని.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని కండిషన్స్ పెట్టారంటూ చెప్పుకొచ్చింది నయనతార. ఐతే ఆ కండిషన్స్ తనకు నచ్చకపోవడంతో.. అంతపెద్ద సినిమా రిజెక్ట్ చేసినట్లు కాస్టింగ్ కౌచ్ అనుభవాలను నేషనల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది నయన్. ఆ హీరో ఎవరు.. నిర్మాత ఎవరు.. సినిమా ఏంటి అన్నది చెప్పకపోయినా.. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని నయనతార చెప్పుకోవడం ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది.
దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్ కనిపిస్తున్నాయ్. కాస్టింగ్ కౌచ్‌కు ఎండ్ కార్డ్ వేయాలని కొందరు అంటుంటే.. ఎక్కువమంది మాత్రం నయనతారను కార్నర్ చేస్తున్నారు. నయనతార అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్.. కాదు కాదు ప్రేమాయణాలకు కేరాఫ్. ఇతనితో ప్రేమలో ఉంది అని రాసుకునే లోపే.. పెయిర్ మార్చేయడం నయనతార ప్రత్యేకత అని.. అలాంటి హీరోయిన్.. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా గుస్సా అవుతున్నారు. విఘ్నేష్‌తో పెళ్లికి ముందు నయన్‌కు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయ్. శింబుతో పెళ్లిపీటల వరకు వెళ్లిన ప్రేమ వ్యవహారం ఆ తర్వాత యూటర్న్ తీసుకొని.. ప్రభుదేవ దగ్గర ఆగింది. ప్రభుదేవా విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుదేవా మొదటి భార్య విడాకులు, నయన్ వ్యవహారంపై జాతీయస్థాయిలో రచ్చ జరిగింది. చివరికి ఆ స్టోరీ బ్రేకప్‌గానే మిగిలింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తోనూ ప్రేమాయణం నడిపించింది నయనతార. పార్టీలు, ట్రిప్పుల్లో ఇద్దరు ఉన్న ఫొటోలు.. ఆ మధ్య తెగ హల్‌చల్ చేశాయ్. కట్ చేస్తే.. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా బ్రేకప్ సాంగ్సే మిగిలాయ్.
ఒక్కో స్టేజిలో ఒక్కొక్కరిని కెరీర్‌లో ఎదిగేందుకు వాడుకొని.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి వదిలేసిన నయనతార.. ఇప్పుడు ఇలాంటి పత్తిత్తు మాటలు మాట్లాడం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో! పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే దాకా చల్లారలేదంటూ మరికొందరు అయితే ఘాటుగానే స్పందిస్తున్నారు. ప్రభుదేవా కుటుంబ జీవితాన్ని నాశనం చేసింది ఎవరు.. అతని భార్య పిల్లలని విడదీసింది ఎవరు.. నువ్వు కాదా అంటూ నిలదీస్తున్నారు. అలాంటి నువ్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం.. సో సిల్లీ అంటూ కొట్టి పారేస్తున్నారు. ఏమైనా ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదు.. నయనతార సెంట్రిక్‌గా మరో కాంట్రవర్సీ ఖాయంగా కనిపిస్తోంది.