Nayanatara: జవాన్ హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన నయన
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలె అంటున్న నయనతార.

Nayanthara is the Tamil actress who has increased the remuneration the most in South India
సౌత్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార. ఇది అందరికీ తెలిసిన విషయమే. జవాన్ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అయిపోయింది. జవాన్ పేరు చెప్పి పారితోషికాన్ని డబుల్ చేసేసిందట. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నయనతార.. వెండితెరపైకి వచ్చి ఇరవై ఏళ్లయింది. చంద్రముఖి హిట్ తర్వాత స్టార్ ఇమేజ్‌తో టాప్ ప్లేస్‌లోకి దూసుకుపోయింది. ప్రభుదేవాతో లవ్ బ్రేకప్ తర్వాత మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేసి.. సౌత్ హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రస్‌గా నిలిచింది నయన. స్టార్స్ అందరూ రెండు కోట్లు తీసుకుంటున్న టైంలో నయన నాలుగు కోట్లు తీసుకుంది. పెళ్లి, పిల్లలు తర్వాత 5కోట్లు డిమాండ్ చేసిందని టాక్. ఇంతలో జవాన్ బ్లాక్‌బస్టర్‌తో రెమ్యునరేషన్ పెంచేసింది. సినిమా ఆరు రోజుల్లో 6వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
నయనకు ఇది తొలి హిందీ మూవీనే అయినా.. ఇంపార్టెంట్ రోల్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. జవాన్ తీసుకొచ్చిన క్రేజ్‌తో నయన రెమ్యునరేషన్ ఇండియాలో సెకండ్.. థర్డ్ ప్లేస్‌కు చేరిందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హాలీవుడ్‌కు వెళ్లిపోయిన గ్లోబర్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను పక్కన పెడితే.. దీపిక పదుకునే 15 కోట్లు తీసుకుంటూ టాప్ ప్లేస్‌లో వుంది. ఆతర్వాత ప్లేస్‌లో అలియా భట్ వుంది. వీళ్ల రెమ్యునరేషన్‌తో నయన పోటీపడుతోంది. సౌత్ టాప్ హీరోయిన్స్ అందరికంటే.. రెండు కోట్లు ఎక్కువ తీసుకునే నయన జవాన్ బ్లాక్‌బస్టర్ పేరు చెప్పుకుని.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌తో పోటీపడుతోంది. నయనతార డేట్స్ కావాలంటే.. 10కోట్లు ఇవ్వాల్సిందేనట. మరి తెలుగు పాన్ ఇండియా మూవీస్ కోసం 10కోట్లు ఇచ్చి నయనను తీసుకుంటారా.. నాలుగైదు కోట్లు ఇవ్వడానికి ఆలోచించే నిర్మాతలు.. పాన్ ఇండియా ఇమేజ్ వున్న హీరోయిన్ కావాలంటే.. నయన కోరినంత ఇవ్వాల్సిందేనేమో.