Olympics Bill Gates : ఒలింపిక్స్ బరిలో బిల్ గేట్స్ అల్లుడు..
పారిస్ ఒలింపిక్స్ లో ప్రముఖ బిలియనీర్ బిల్‌గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ పోటీ చేస్తున్నాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో ఈజిప్టు తరఫున బరిలో ఉన్నాడు.

Nayel Nasser, the son-in-law of famous billionaire Bill Gates, is competing in the Paris Olympics.
పారిస్ ఒలింపిక్స్ లో ప్రముఖ బిలియనీర్ బిల్‌గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ పోటీ చేస్తున్నాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో ఈజిప్టు తరఫున బరిలో ఉన్నాడు. ఈక్వెస్ట్రియన్ జంపింగ్ వ్యక్తిగత విభాగంలో నాజర్ పోటీ పడుతున్నాడు. గతంలోనూ ఈజిప్టు తరఫున 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఈజిప్టియన్-అమెరికన్ అయిన నాజర్ 10 ఏళ్ల వయసులో ఈక్వెస్ట్రియన్ జంపింగ్ చేయడం మొదలుపెట్టాడు. 2013, 2014, 2017లో ఎఫ్‌ఈఐ వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. నాజర్ తల్లిదండ్రులు ఈజిప్టుకు చెందిన వారు కావడంతో ఒలింపిక్స్‌లో ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈక్వెస్ట్రియన్ పోటీల సమయంలోనే బిల్ గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ 2021లో పెళ్ళి చేసుకున్నారు.