NCP Ajit Pawar : కేంద్రమంత్రి పదవిపై NCP అసంతృప్తి… సహాయక మంత్రి పదవి నాకోద్దు NCP

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (National General Elections) ముగిశాయి. వరుసగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ (Narendra Modi) మూడోసారి కూడీ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 11, 2024 | 05:09 PMLast Updated on: Jun 11, 2024 | 5:09 PM

Ncp Is Unhappy With The Post Of Union Minister I Dont Want The Post Of Assistant Minister Ncp

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (National General Elections) ముగిశాయి. వరుసగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ (Narendra Modi) మూడోసారి కూడీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీతో ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ప్రధాన మంత్రితో పాటుగా 30 కేబినెట్ (Union Minister) మంత్రులుగా.. 36 కేంద్ర సహాయక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. బీజేపీ (BJP) మిత్రపక్షాలతో కలిపి ఎన్టీఏ కూటమిలో భాగంగా టీడీపీ(TDP), జేడీయూ(JDU), శివసేన (Shiv Sena), ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి కీలక నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కాగా ఇక్కడే ఎన్సీపీ పార్టీ కొంత అసంతృప్తంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ సారి ఎన్డీఏ కూటమి (NDA Alliance) లో భాగంగా తమ పార్టీకి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కవాలని ఎన్సీపీ (NCP) పార్టీ చీఫ్ అజిత్ పవార్ (Ajit Pawar) తేల్చి చెప్పారు. ఈ సారి NCP పార్టికి సహాయ మంత్రి పదవిని బీజేపీ (BJP) ఆఫర్ చేసింది. NCP అధినేత అజిత్ పవార్.. ప్రపుల్ పటేల్ పేరును సూచించారు. అయితే, సహాయ మంత్రి పదవిని చేపట్టడానికి ప్రపుల్ పటేల్ ఆసక్తి చూపలేదు. తాను గతంలోనే కేబినెట్ పదవిని చేశానని.. ఇప్పుడు సహాయ మంత్రి పదవి ఇవ్వటమేంటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వతంత్ర బాధ్యతలతో సహాయ మంత్రి పదవి తీసుకోవడం మాకు సరైంది కాదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అన్నారు.