BJP at Rajya Sabha : మెజార్టీకి 4 సీట్ల దూరంలో ఎన్డీఏ… రాజ్యసభలో పెరిగిన బలం !
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) కు ముందు రాజ్యసభలో సీట్లు పెరగడం బీజేపీ ఆధ్వర్యంలోని NDA కూటమికి (NDA Alliance) మంచి బూస్టింగ్ ఇచ్చింది. పెద్దల సభలో ఇంకా NDA మెజారిటీకి నాలుగు ఓట్ల దూరంలో నిలిచింది.
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) కు ముందు రాజ్యసభలో సీట్లు పెరగడం బీజేపీ ఆధ్వర్యంలోని NDA కూటమికి (NDA Alliance) మంచి బూస్టింగ్ ఇచ్చింది. పెద్దల సభలో ఇంకా NDA మెజారిటీకి నాలుగు ఓట్ల దూరంలో నిలిచింది.
రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉన్నాయి. వీటిల్లో జమ్ము-కాశ్మీర్ (Jammu Kashmir) లో అసెంబ్లీ లేకపోవడంతో 4 సీట్లు ఖాళీ. నామినేటెడ్ కేటగిరీలో ఒక్క సీటు ఖాళీగా ఉంది. ఇక మిగిలిన 240 స్థానాల రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం 117కు చేరింది. అంటే మరో 4 సీట్లు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ 121కు చేరుతుంది. మోడీ ప్రభుత్వానికి ఇప్పటిదాకా రాజ్యసభలో సంఖ్యా బలం లేకపోయినా… కీలక బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పాస్ అవుతున్నాయి. ఏ కూటమిలో చేరకుండా ఉన్న రాజకీయ పార్టీలు YSRCP, బిజూ జనతా దళ్(BJD) లాంటివి మోడీ ప్రభుత్వం తెచ్చిన అనేక బిల్లులకు మద్దతు తెలిపాయి. మొన్నటి ఎన్నికల తర్వాత రాజ్యసభలో వైసీపీ (YCP) కి 11 మంది ఎంపీలు ఉన్నారు.
ఈమధ్యే మూడు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ తన హవా కంటిన్యూ చేస్తోంది. బీజేపీ వ్యూహాలకు ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా కకలావికలం అవుతోంది. రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా 28 సీట్లు మాత్రమే గెలవాలి. కానీ క్రాస్ ఓటింగ్ తో మరో 2 సీట్లు అదనంగా గెలుచుకుంది. మొత్తం 56 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 30 సీట్లు బీజేపీ గెలిచింది. ఎన్డీఏ మిత్రపక్షాలు మరో 5 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ 20 సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. యూపీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో జరిగిన ఎన్నికల్లో 10 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బీజేపీకి సొంతంగా 97 ఎంపీలు ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో క్రాస్ ఓటింగ్ – సంక్షోభంలో కాంగ్రెస్ ప్రభుత్వం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ కి సొంతంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు తప్పనిసరి. కానీ సీన్ రివర్స్ అయి బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థికి 34 ఓట్లు రాగా… బీజేపీ నుంచి నిలబడ్డ హర్ష్ మహాజన్ కూడా 34 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు టాస్ వేశారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థి సింఘ్వి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలిచారు. ఈ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.
ఉత్తర్ ప్రదేశ్ లోనూ సమాజ్ వాదీ పార్టీకి ఉన్న బలంతో ముగ్గురు గెలవాల్సి ఉంది. కానీ 8 మంది SP ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఇద్దరు ఎస్పీ నుంచి, 8 మంది బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. హర్యానాలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అక్కడ కూడా కాంగ్రెస్ సర్కార్ మీద ఆ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. మొత్తానికి ఈ రాజ్యసభ ఎన్నికల్లో NDA ఊహించని విధంగా మెజార్టీ మార్క్ దగ్గరకు చేరుకుంది.