Anil Kumar Yadav: ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల వీరంగం..
హైదరాబాద్‌లో నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు రెచ్చిపోయారు. హైదరాబాద్‌లో అనిల్ కుమార్ ఉంటున్న అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్‌మెంట్‌లో ఎమ్మెల్యే అనిల్ ఉంటున్నారు.

Anil Kumar Yadav followers Attack On Apartment Security
కారు పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ సిబ్బందికి అనిల్ కుమార్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. అనిల్ కాన్వాయ్‌ని అపార్ట్‌మెంట్ రోడ్డుపై ఆపడంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లకు అడ్డుచెప్పారు. అపార్ట్‌మెంట్‌లో కేటాయించిన పార్కింగ్‌లో కారు పార్క్ చేసుకోవాలంటూ చెప్పారు. ఇదే విషయంలో సెక్యూరిటీ సిబ్బందికి అనిల్ కుమార్ అనుచరులకు వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు.
అయితే గొడవ జరిగినప్పుడు అనిల్ అక్కడే ఉన్నారని.. ఉద్దేశపూర్వకంగా తమపై దాడి చేయించారి సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ఎమ్మెల్యే అండచూసుకునే ఆయన అనుచరులు తమపై దాడి చేశారని చెప్తున్నారు. ఈ గొడవ మొత్తాన్ని షూట్ చేసి స్థానికులు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇష్యూ వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.